జాతీయ వార్తలుMohammad Usman Terrorist Arrest: జిహాద్‌కన్నా జుట్టుకే ప్రాధాన్యం.. హెయిర్‌ ప్లాంటేషన్‌తో దొరికిపోయిన కీలక ఉగ్రవాది!

Mohammad Usman Terrorist Arrest: జిహాద్‌కన్నా జుట్టుకే ప్రాధాన్యం.. హెయిర్‌ ప్లాంటేషన్‌తో దొరికిపోయిన కీలక ఉగ్రవాది!

Mohammad Usman Terrorist Arrest: జిహాద్‌ కంటే జుట్టు పెంచుకోవడమే తనకు ముఖ్యమని భావించిన ఓ ఉగ్రవాది.. తర్వాత ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునానడు. తర్వాత వీసా సంపాదించి దేశంనుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో అతను జిహాద్‌ను పక్కన పెట్టాడు. వచ్చిన పని మర్చిపోయాడు. చివరకు పోలీసులకు పట్టుపడ్డాడు. ఈ చర్యలు ఉగ్రవాద నెట్‌వర్క్‌లోని కొత్త వాస్తవాలను బయటపెడుతున్నాయి.

ఉగ్రవాద శిక్షణ పొంది..
లష్కర్‌ ఎ తోయిబాకు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌ ఆయుధాల వినియోగం, బాంబు తయారీ, టార్గెట్‌ ఎంపిక, ఎగరేయడం వంటి అన్ని ఉగ్రవాద కళల్లో ప్రావీణ్యం సాధించిన వ్యక్తి. రెండంచెల శిక్షణ పొంది, పాకిస్తాన్‌ హ్యాండ్లర్లతో కాంటాక్ట్‌లో ఉంటూ జమ్మూ–కశ్మీర్‌లో 16 ఏళ్లుగా కొనసాగుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్న జర్గాం, అబు హురేరా వంటి వారి ఆదేశాల మేరకు పని చేశాడు. కానీ ఇతనికి ఒక పెద్ద సమస్య ఉంది – బట్టతల. దీని వల్ల తన కాన్ఫిడెన్స్‌ దెబ్బతిన్నట్లు భావించిన ఉస్మాన్, అబు హురేరాకు తన సమస్య చెప్పి సహాయం కోరాడు. ఫలితంగా శ్రీనగర్‌లోని ఒక ఆసుపత్రిలో హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్నాడు. ఆ సమయంలో నలుగురు ఉగ్రవాదులు అతనికి కాపలా ఉండడం గమనార్హం.

జుట్టు పెరిగాక మారిన ఆలోచనలు..
జుట్టు పెరిగిన తర్వాత ఉస్మాన్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. జిహాద్‌ను పక్కన పెట్టి, స్థానిక అమ్మాయిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జమ్మూ, పంజాబ్‌ ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి రెండు నెలలు గడిపాడు. ఇంగ్లీష్‌ నేర్చుకోవడం, జీవితాన్ని ఆనందంగా గడపడం, ఆధార్, పాన్‌ కార్డులు, పాస్‌పోర్టు తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేశాడు.ఇదే క్రమంలో పోలీసులకు చిక్కాడు. విచారణలో ‘తాను ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనలేదు, జుట్టు పెంచుకునే పనిలో ఉన్నాను‘ అని చెప్పినట్లు సమాచారం. ఉమర్‌ అనే మరో ఉగ్రవాది కూడా ఇలాంటి మార్గం అనుసరించాడు. కశ్మీర్‌లో కొంత కాలం ఉగ్రవాద కార్యకలాపాలు చేసిన అతను యూపీ–బిహార్‌కు వెళ్లి, వీసా తీసుకుని ఇండోనేషియా, సౌదీ అరేబియా వెళ్లాడు. ఎన్‌ఐఏ ఈ వ్యవహారాన్ని గుర్తించి అతన్ని అరెస్టు చేసింది.

పాకిస్తాన్‌ వ్యూహంలోని లోపం?
ఈ ఘటనలు పాకిస్తాన్‌ నుంచి ఉగ్రవాదులను పంపే వ్యూహంలోని బలహీనతను చూపిస్తున్నాయి. ఇక్కడి సౌకర్యాలు, ఆధునిక వైద్య సదుపాయాలు, సాధారణ జీవితం చూసి వారు తమ అసలు లక్ష్యాన్ని మరచిపోతున్నట్లు కనిపిస్తోంది. జిహాద్‌ కంటే వ్యక్తిగత సుఖాలు, సాధారణ జీవితం పట్ల ఆకర్షణ ఎక్కువవుతుండటం భారత భద్రతా ఏజెన్సీలకు కొత్త అవకాశాలను ఇస్తోంది.

ఉగ్రవాదం అనేది కేవలం ఆయుధాలు, బాంబులతో మాత్రమే కాదు – వ్యక్తిగత కోరికలు, బలహీనతలు కూడా దాన్ని బలహీనపరుస్తాయనడానికి మహ్మద్‌ ఉస్మాన్‌ కథ ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Pakistan Border Conspiracy: సరిహద్దుల్లో పాకిస్థాన్ దుర్మార్గం.. ఇదీ దాని ఉగ్రవాద రూపం..

Pakistan Border Conspiracy: పాకిస్తాన్ మన దేశం విషయంలో చేయనీ దుర్మార్గం అంటూ లేదు. అన్ని విధాలుగా మన దేశంలో దారుణాలకు పాల్పడింది. కానీ కొంతకాలంగా పాకిస్తాన్ ఆగడాలు మనదేశంలో చెల్లుబాటు కావడం...

Radical Network India: యూపీ ఏటీఎస్‌ రాడికల్‌ నెట్‌వర్క్‌.. హిందువు పేరుతో ఉగ్ర కార్యకలాపాలు!

Radical Network India: పాకిస్తాన్‌ భారత దేశంలో ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు హిందువులను టార్గెట్‌ చేస్తోంది. పేదరికం ఆసరాగా చేసుకుని డబ్బులు ఆశచూపి ర్యాడికలైజేషన్‌ చేస్తోంది. దేశంలో అల్లర్లు, దాడులకు ఉసిగొల్పుతోంది. అతంటి...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version