India Warning to Bhutto: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి సంచలనంగా మారింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడికి బాధ్యులుగా గుర్తించిన భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇదే సమయంలో భారత్ – పాకిస్తాన్ మధ్య ఉన్న సిందూ జలాల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ)ని నిలిపివేసింది. మరోవైపు వంద మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. 9 ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసింది. 11 ఎయిర్ బెసేలపై దాడి చేసింది. ఇక సిందూ ఒప్పందం నిలపివేయడంతో పాకిస్తాన్‌లో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అవసరం లేనప్పుడు నీటిని వదులుతూ.. అవసరం ఉన్నప్పుడు ఆపేస్తూ పాకిస్తాన్‌కు భారత్ చుక్కలు చూపిస్తోంది. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా పాక్ సైనికాధికారి ఆసిఫ్ మునీర్ సిందూ నదిపై భారత్ కట్టే డ్యాంలు క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరించారు. అణు ఆయుధ హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఈ నిర్ణయాన్ని ‘యుద్ధ చర్య‘గా అభివర్ణించారు.
Also Read: మనిషివా.. ‘ట్రంప్’ వా?
సింధూ నదీ జలాల ఒప్పందం ఇలా..
1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్–పాకిస్తాన్ మధ్య సంతకం కుదిరిన ఒప్పందం ఇదీ. రెండు దేశాల మధ్య నీటి వనరుల విభజనను నియంత్రిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, సింధు, జీలం, చీనాబ్ నదులు (పశ్చిమ నదులు) పాకిస్తాన్‌కు, రవి, బియాస్, సట్లెజ్ నదులు (తూర్పు నదులు) భారత్‌కు కేటాయించబడ్డాయి. ఈ ఒప్పందం దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధాలు, ఉగ్రవాద సంఘటనలు ఉన్నప్పటికీ నీటి విషయంలో సహకారాన్ని కొనసాగించింది. అయితే, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది, దీనిని పాకిస్తాన్ ‘యుద్ధ చర్య‘గా ఖండించింది.
భారత్ సంచలన నిర్ణయం..
భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం. పహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు మరణించడంతో, భారత్ ఈ చర్యను పాకిస్తాన్‌కు శిక్షగా భావించింది. ఈ నిర్ణయం వల్ల భారత్ ఇకపై నీటి ప్రవాహ డేటాను పాకిస్తాన్‌తో పంచుకోవాల్సిన అవసరం లేదు. పశ్చిమ నదులపై జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడంలో పాకిస్తాన్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవలసిన బాధ్యత లేదు.
పాకిస్తాన్‌పై తీవ్ర ప్రభావం
సింధు నదీ బేసిన్ నీరు పాకిస్తాన్ వ్యవసాయానికి 80%, జలవిద్యుత్ ఉత్పత్తికి కీలకం. నీటి ప్రవాహంలో ఏదైనా అంతరాయం ఆహార భద్రతను, రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తుంది. పాకిస్తాన్‌లోని సింధ్, పంజాబ్ ప్రాంతాల్లో నీటి కొరత ఇప్పటికే రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలను పెంచుతోంది. భారత్ చర్యలు ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ సైనికాధికారి, మాజీ మంత్రి స్పందించారు. బిలావర్ భుట్టో భారత్ చర్యలను ‘యుద్ధ ప్రకటన‘గా అభివర్ణించారు. ‘సింధు నదిలో నీరు కాదు, రక్తం ప్రవహిస్తుంది‘ అని హెచ్చరించారు, ఇది దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రజలు భారత్‌తో ఘర్షణకు సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది.
Also Read: అసిమ్ మునీర్ పాక్ అధ్యక్షుడవుతారా.. ట్రంప్ అనుగ్రహం కోసమే అమెరికా వెళ్లారా?
లైట్ తీసుకుంటున్న భారత్..
ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌తో చావుతప్పి కన్ను చొట్టబోయిన చందంగా ఉన్న పాకిస్తాన్ తాజాగా అమెరికా అండ చూసుకుని తోక జాడిస్తోంది. కానీ మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. అణు బెదిరింపులకు భయపడమని. తాజా బెదిరింపులను భారత్ కనీసం పట్టించుకోవడం లేద. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ సైనికాధికారి ఆసిఫ్ మునీర్ భయంతో బంకర్‌లో దాక్కున్నాడు. ఇప్పుడు అమెరికాకు వెళ్లి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారతీయులు మండిపడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని, కేవలం హోల్డ్‌లో ఉందని గుర్తు చేస్తున్నారు. రెచ్చగొడితే నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.