Narendra Modi: దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్రమోదీపై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ప్రపంచ దేశాలు మాత్రం మోదీని విశ్వగురువుగా చూస్తున్నారు. అమెరికా పత్రికలు కురిపించిన ప్రశంసలతో ఇది మరోసారి రుజువైంది. ఇందుకు ప్రధాన కారణం షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వేదికగా యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చేసిన సూచన. యుద్ధం ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ నుంచి అగ్రరాజ్యం అమెరికా వరకు రష్యా యుద్ధం ఆపాలని భారత్ చెప్పాలని ఎదురు చూస్తున్నాయి. ఇందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలñ న్‌స్కీ అయితే యుద్ధం ప్రారంభమన మొదట్లో నేరుగా భారత ప్రధానిని ఈమేరకు అభ్యర్థించారు కూడా. కానీ రష్యాతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో భారత్ ఎక్కడా రష్యాకు వ్యతిరేకంగా ఏ వేదికపైనా మాట్లాడలేదు. ఎట్టకేలకు నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కే భారత ప్రధాని నరేంద్రమోదీ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఆకాశానికెత్తిన అమెరికా మీడియా..
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం రష్యా చేస్తున్న యుద్ధంపై కీలక సూచన చేశారు. ‘ప్రస్తుతం యుగం యుద్ధాల కాలం కాదని, ఏదైనా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి’ అని ఉక్రెయిన్‌పై సైనిక చర్య గురించి ప్రస్తావించారు. మోదీ సూచనను పపంచంలోని చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. అమెరికాలోని ప్రధాన పత్రిక వాషింగ్‌టన్ పోస్ట్.. ‘మోదీ రిబ్యూక్స్ పుతిన్’ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. యుద్ధం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను భారత ప్రదాని మోదీ హెచ్చరించారని పేర్కొంది. మోదీకి పుతిన్ చెప్పిన విషయాలను కూడా ఇందులో ప్రచురించింది. ‘భారత దేశ ఉద్దేశం నాకు అర్థమైంది. మేము త్వరగా యుద్ధం ముగించాలని చూస్తున్నాం. కానీ ఉక్రెయిన్ చర్చలకు స్వస్తి చెప్పింది. అయినా యుద్ధ విరమణకు మా నుంచి ప్రయత్నం చేస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం’ అని పుతిన్ తెలిపినట్లు వివరించింది. ఇక న్యూయార్క్ టైమ్స్ కూడా ‘యుద్ధానికి ఇది సమయం కాదు’ అనే అర్థం వచ్చేలా ‘ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇరాఫ్ వార్’ అని పతాక శీర్షికన కథనం ఇచ్చింది. ఇందులో మోదీ చేసిన సూచనలతోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పుతిన్‌తో మాట్లాడిన తీరును పోల్చుతూ కథనం ఇచ్చారు. ఇందులో చైనా అధ్యక్షుడు సున్నితంగా పుతిన్‌తో యుద్ధం గురించి మాట్లాడారని, మోదీ మాత్రం ముక్కుసూటిగా, స్పష్టంగా చెప్పారని విరించింది.
నచ్చిన విషయం కాబట్టే ప్రాధాన్యం..
రష్యా చేస్తున్న యుద్ధంపై మోదీ చేసిన సూచన అమెరికాకు చాలా బాగా న చ్చింది. దీంతో పత్రికల్లో పతాకస్థాయి కథనాలు వండి వార్చింది. అదే పాక్‌కు అమెరికా ఆయుధాల సరఫరా చేయడాన్ని, ఆర్థిక సాయం చేయడం గురించి పుతిన్‌తో చర్చించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. పతాక శీర్షిక కథనాలు కనిపించేవి కావు. ఇరన్‌పై ఆంక్షల గురించి కూడా చర్చించినా అమెరికా మీడియా పట్టించుకునేది కాదు. అమెరికాకు నచ్చితేనే ఎత్తుకుంటాయి.. లేదంటే పట్టించుకోవు. ఏది ఏమైనా యుద్ధం విషయంలో ఇన్నాళ్లకు భారత్ నుంచి సరైన సూచన చేసినట్లుగా ప్రపంచ దేశాలు మోదీని ప్రశంశిస్తున్నాయి.
[…] Also Read: Narendra Modi: అమెరికా మీడియాలో మోదీ పతాక శీర్… […]