https://oktelugu.com/

Modi Arrival: మోడీ రాక.. బేగంపేట ఎయిర్ పోర్టుకు మోడీ.. ఆహ్వానించేందుకు మాత్రం కాదు.. ఎందుకంటే?

Modi Arrival: తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి. దీనికి ప్రధాని మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. దీంతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించి అధికార పార్టీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీని […]

Written By: Srinivas, Updated On : July 2, 2022 12:47 pm
Follow us on

Modi Arrival: తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి. దీనికి ప్రధాని మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. దీంతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించి అధికార పార్టీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీని నిలువరించాలనే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ టీఆర్ఎస్ కూడా నగరమంతా గులాబీ మయం చేసింది.

Modi Arrival

Modi

నగరమంతా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాషాయ, గులాబీ వర్ణాలు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా రెండు పార్టీల జెండాలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినట్లు తెలుస్తోంది. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. గులాబీ బాస్ బీజేపీని టార్గెట్ చేసుకుని జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తున్నా ఆ ఫలితాలు కనిపించడం లేదు.

Also Read: Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ ని ఇంటికి పిలిచి ఘోరంగా అవమానించిన స్టార్ హీరో

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. కానీ ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్ ప్రకారం సీఎం వెళ్లాల్సి ఉన్నా వెళ్లడం లేదు. కనీస మర్యాదలు పాటించడం లేదు. ప్రధానికి స్వాగతం చెప్పేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం బేగంపేట విమానాశ్రయానికి వెళ్తున్నారు. విపక్షాల రాష్టపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రికేమో శ్రీనివాస్ యాదవ్, యశ్వంత్ సిన్హాకేమో కేసీఆర్ స్వాగతాలు పలుకుతున్నారు.

Modi Arrival

BJP Leaders

యశ్వంత్ సిన్హాను ర్యాలీ ద్వారా జలవిహార్ కు తీసుకురానున్నారు. అక్కడ భోజనం చేసిన అనంతరం ఆయన తనకు మద్దతు ఇవ్వాలని అందరిని కోరనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా పీఎం వచ్చినప్పుడు ఏదో ఒక కారణం చూపించి సీఎం స్వాగతం చెప్పకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు కూడా యశ్వంత్ సిన్హాను సాకుగా చూపి ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లడం లేదు. అప్పట్లో సమతా మూర్తి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు కూడా ఆరోగ్యం బాగా లేదని తప్పించుకున్నట్లు తెలిసిందే.

Modi Arrival

Yashwantsinha

ప్రధాని మోడీ ఎన్నిసార్లు నగర పర్యటనకు వచ్చినా కేసీఆర్ ఏదో సాకు చూపి వెళ్లడానికి వెనకాడుతున్నారు. బీజేపీపై కోపంతోనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కేసీఆర్ వెళ్లనంత మాత్రాన ఏదైనా ఆగుతుందా? బీజేపీకి సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే యశ్వంత్ సిన్హా తో ర్యాలీ చేయించాలని ప్లాన్ వేసినట్లు సమాచారం. కానీ బీజేపీని అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ తరం కాదని తెలిసినా హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడం టీఆర్ఎస్ కు అలవాటుగానే మారింది.

Also Read: Daddy Movie Child Artist: డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Tags