modi rajyasabha
మన పార్లమెంట్ పరువు పోయింది. కాంగ్రెస్ సహా విపక్షాలు చేసిన లొల్లి ఈరోజు పతాక శీర్షిక అయ్యింది. దీంతో బీజేపీ సీరియస్ గా ఉంది. ప్రధాని మోడీ నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్య వరకు దీన్ని వదిలిపెట్టకూడదని డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలోనే రాజ్యసభలో విపక్ష ఎంపీల ప్రవర్తనపై అధికారపక్షం సీరియస్ గా ఉంది. రూల్ 256 ప్రకారం సభ్యుల సస్పెన్షన్ కోరుతూ తీర్మానానికి సిద్ధమైంది. ఈరోజు తీర్మానాన్ని రాజ్యభలో ప్రవేశపెడుతున్నారు.
రైతు బిల్లల సమయంలో పలువురు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మరీ దురుసు ప్రవర్తన చేయడం.. బెంచీల మీదకెక్కి విపక్ష ఎంపీలు హంగామా సృష్టించడం..ఎంపీలను బయటకు తీసుకెళ్లేందుకు వచ్చిన మార్షల్స్ పైనా దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అయితే మార్షల్ పై చేయి చేసుకున్నాడు. దీంతో వీడియో పుటేజీ పరిశీలించి ఎంపీలపై కఠిన చర్యలకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 8మంది సభ్యులపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది.