
PM Modi: పార్లమెంటుకు మోడీ వచ్చారు. వచ్చి రాగానే శాంత స్వభావంతో మాట్లాడారు.. ఆ తర్వాత ప్రతిపక్షాలను చెడుగుడు ఆడుకున్నారు. ముఖ్యంగా మొన్న జరిగిన భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటం కిస్తూ తీవ్రమైన విమర్శలు చేశారు..” కాశ్మీర్ రావణ రాష్ట్రంలో రగిలేందుకు కారణం ఎవరు? ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు అమలు ఎందుకు కారణం ఎవరు? లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం ఎగరకుండా అడ్డుపడ్డది ఎవరు? కాశ్మీరు పండిట్లు వలస వెళ్లడానికి కారణం ఎవరు” ఇలా ప్రశ్నలు వేసుకుంటూ కాంగ్రెస్ నాయకులను, ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని తూర్పారబట్టారు.. ఈ దేశానికి సంబంధించి సార్వభౌమాధికారాన్ని పూర్తిస్థాయిలో పరిపుష్టం చేసే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని మోడీ వివరించారు. వాస్తవానికి మోడీ ఇలా ఉగ్ర నరసింహుడిలా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడటానికి కారణం లేకపోలేదు.
అదాని ఆస్తులపై హిండెన్ బర్గ్ సంచలన రిపోర్ట్ ఇవ్వడంతో ఆ కంపెనీ షేర్లు కుప్పకూలడం మొదలయ్యాయి.. ఆదాని కంపెనీ ఈ స్థాయిలో లాభాలు కల చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.. పార్లమెంటులో దీనిపై అడ్వైజరీ కమిటీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.. అంతేకాదు జీవీకే కంపెనీ పై కేసులు పెట్టి ఆదాని కంపెనీకి లాభం చేకూర్చేలా వ్యవహరించారని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.. ఈ పరిణామంతో మనస నొచ్చుకున్న నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ పురోగమనంలో వెళ్తుంటే కాంగ్రెస్ దానికి అడ్డుపడుతున్నదని వ్యాఖ్యానించారు.

పార్లమెంటులో సుదీర్ఘంగా మాట్లాడిన నరేంద్ర మోడీ భారత రాష్ట్రపతి ద్రౌపది వ్యక్తిత్వాన్ని కొనియాడారు.. ఆదివాసి తెగ నుంచి వచ్చిన ఒక మహిళ రాష్ట్రపతిగా ఈ దేశాన్ని పరిపాలించడం గొప్ప విషయం అన్నారు.. రాష్ట్రపతి ఎన్నిక అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వివాదాస్పదం చేసిందని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు ఆదివాసీలపై కూడా తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. మోడీ ఒకసారిగా ఫైర్ అవడంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ మోడ్ లో పడింది.. కనీసం ప్రధాని ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని స్థితిలోకి పడిపోయింది.
ఇక 2024లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల అటెన్షన్ ను తన వైపు తిప్పుకునేలా మోడీ ప్రయత్నించారు.. తన సహజ సిద్ధ ప్రసంగాన్ని చదువుకుంటూ వెళ్లారు.. చేస్తున్న ప్రతి విమర్శను ఉదాహరణతో చెప్పి కాంగ్రెస్ పార్టీని బోనులో నిలబెట్టారు.. ఒక రకంగా చెప్పాలంటే సుహృద్భావ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ ఎండగట్టారు.. కాదు 2024 లో ఎటువంటి ఫలితాలు వస్తాయో ప్రతిపక్షాలకు ముందే చూపించారు. అంటే ప్రతిపక్షాలు కాలు చేయి కూడ తీసుకునే సమయానికి… మేము అన్నింటిలో ముందున్నామని మోదీ చెప్పకనే చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీపై నరేంద్ర మోడీ చేసిన విమర్శలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Highlighted how the situation in Jammu and Kashmir has changed for the betterment of the people. pic.twitter.com/zDRviSAdNS
— Narendra Modi (@narendramodi) February 8, 2023