Homeజాతీయ వార్తలుWomen Reservation Bill 2026: బలం లేదని తెలిసినా బిల్లు పెట్టడం వెనుక మోదీ పెద్ద...

Women Reservation Bill 2026: బలం లేదని తెలిసినా బిల్లు పెట్టడం వెనుక మోదీ పెద్ద వ్యూహం!

Women Reservation Bill 2026: కొండను లాగేందుకు వెంట్రుక వేసినట్లుగా ఉంది కేంద్ర తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు. 130వ రాజ్యాంగ సవరణ కోసం కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసింది. రాజ్యాంగ సవరణతోపాటు డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావించింది. దీంతో భవిష్యత్‌లో బీజేపీకి తిరుగు ఉండదని ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ లేకపోయినా బిల్లు పెట్టి పెద్ద సాహసమే చేశారు. అయితే కొండ, వెంట్రుక చందంగా బిల్లు ఆమోదం పొందినా లాభమే, పొందక పోయినా లాభమే అన్నట్లుగా కేంద్రం ఈ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఊహించినట్లుగానే బిల్లు వీగిపోయింది. లోక్‌సభ సీట్లను 543 నుంచి 816కు పెంచి, వాటిలో 272ను మహిళలకు కేటాయించే ప్రతిపాదన ప్రతిపక్షాల ఏకత్వ వ్యతిరేకతతో నిలిచిపోయింది. ఈ ఫలితం మహిళా రిజర్వేషన్‌ 2029 ఎన్నికల్లో అమలు కాకుండా చేసింది.

ఓటింగ్‌ గణాంకాలు ఇలా..
లోక్‌సభలో 528 మంది ఎంపీలు ఓటు వేశారు. ఎన్డీఏకు 298 అనుకూల ఓట్లు లభించాయి, 230 మంది వ్యతిరేకించారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన రెండు మూడో వంతుల మెజారిటీ (362 ఓట్లు) సాధించలేకపోయింది. ఈ లోటు ఎన్డీఏ అలయన్స్‌లో కొన్ని భాగస్వాముల వైఖరి మార్పుకు సూచిక.

రాజ్యాంగ సవరణపై బిల్లులు..
డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు రాజ్యాంగ సవరణపై ఆధారపడి ఉండటంతో ప్రవేశపెట్టలేకపోయాయి. మూడు చట్టాలు ఒకదానికొకటి లింక్‌గా ఉండటం వల్ల కేంద్రం ప్రణాళిక మొత్తం ఆగిపోయింది. ప్రత్యేక సమావేశాలు పెట్టి బిల్లును ఆమోదించాలన్న ఆకాంక్ష కూడా నెరవేరలేదు.

ప్రతిపక్షాల ప్రధాన అభ్యంతరాలు..
దక్షిణ రాష్ట్రాల సీట్లు తగ్గుతాయని ప్రతిపక్షాలు వాదించాయి. కానీ హోం మంత్రి అమిత్‌ షా ప్రస్తుత వాటానే కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల ప్రపోర్షనల్‌ పెంపు జరుగుతుందని స్పష్టం చేశారు. అయినా భవిష్యత్‌ డీలిమిటేషన్‌ జనాభా ఆధారంగా జరిగి ఉత్తర రాష్ట్రాలు (ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌) ప్రయోజనం పొందుతాయనే అనుమానం వ్యతిరేకతకు మూలం. ప్రస్తుత పెంపుతో తక్షణ నష్టం లేదు, కానీ భవిష్యత్‌ జనాభా లెక్కలు దక్షిణ రాష్ట్రాలను పీరుగుతాయనే భయం విపక్షాల్లో పెరిగింది. ప్రస్తుతం పెంపుతో ఉత్తరాది రాష్ట్రాలకే నష్టం. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఎంపీ 15 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక ఎంపీ 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్‌లో ప్రపోర్షనల్‌ పెంపు హామీ లేకపోవడం ప్రతిపక్షాలను ఏకం చేసింది.

ఎన్డీఏ వ్యూహం..
ఎన్డీఏ మెజారిటీ ఉన్నప్పటికీ రెండు మూడో వంతుల మద్దతు లేకపోవడం ప్రజాస్వామ్య విధానాన్ని బలపరిచింది. బీజేపీ దీర్ఘకాలికంగా ఉత్తర రాష్ట్రాల సీట్ల పెంపుకు లాభం పొందే డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయి. మహిళా రిజర్వేషన్‌ వాయిదా ఎన్డీఏకు రాజకీయ నష్టం కలిగించినా, ప్రచారంలో ‘ప్రతిపక్షాలు మహిళల అధికారాన్ని అడ్డుకున్నాయి‘ అనే మెసేజ్‌ ఇవ్వవచ్చు.

బిల్లు వీగిపోవడంతక్ష 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ అమలు కాకుండా పోయింది. ఎంపీల సంఖ్య పెరగకుండా ఆగింది. దక్షిణ రాష్ట్రాల ఆందోళనలు ముఖ్యంగా జనాభ నియంట్రణ విధానాలపై చర్చను పెంచుతాయి. ఎన్డీఏ అలయన్స్‌ స్థిరత్వం, ప్రతిపక్షాల ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. భవిష్యత్‌ సవరణలకు మార్గం సుగమం కాదు. బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular