https://oktelugu.com/

అప్పుడు వాజ్ పేయి.. ఇప్పుడు మోడీ.. పెట్రోల్ పై సంచలన నిర్ణయం?

మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ అయిల్ నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వ్ క్షేత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో పెట్రోల్ వినియోగం భారీగా ఉండడం తెలిసిందే. మన దేశ దిగుమతుల్లో ప్రధానమైనవి ముడి చమురే..  దేశ ఆర్థికాభివృద్ధిలో పెట్రో ఉత్పత్తులదే కీలక పాత్ర. 1990లో గల్ఫ్ యుద్ధం సందర్భంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. అప్పటికే దేశం ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 11:16 AM IST
    Follow us on


    మోడీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్ అయిల్ నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వ్ క్షేత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో పెట్రోల్ వినియోగం భారీగా ఉండడం తెలిసిందే. మన దేశ దిగుమతుల్లో ప్రధానమైనవి ముడి చమురే..  దేశ ఆర్థికాభివృద్ధిలో పెట్రో ఉత్పత్తులదే కీలక పాత్ర. 1990లో గల్ఫ్ యుద్ధం సందర్భంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. అప్పటికే దేశం ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి తోడు కేవలం మూడు వారాల చమురు మాత్రమే స్టాక్ ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రధానిగా పీవీ నరసింహరావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్  బాధ్యతలు తీసుకున్నారు. దేశ పరిస్థితిని సమీక్షించి ఎల్పీజీ(సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ) విధానంతో ఆర్థిక వ్యవస్థకు జీవం పోశారు.

    Also Read: తెలంగాణలో అంత్యక్రియలకు ముందు మూలిగిన యువతి.. చివరకు..?

    గల్ఫ్ యుద్ధం నాటి అనుభవాలతో.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు పెట్రో ఉత్పత్తుల ప్రాధాన్యం గుర్తించిన.. వాజ్ పేయి  ప్రభుత్వం 1998లో ముడి చమురును భూగర్భంలో రిజర్వ్ క్షేత్రాలను నిర్మించారు. ప్రస్తుతం వీటి నిల్వ సామర్థ్యం 53.3లక్షల టన్నులు ఉంది. ఇప్పుడు అదే బాటలో మోడీ ప్రభుత్వం నడువబోతోంది. ఈ సామర్థ్యాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించింది. దీనికి మరో  ప్రధాన కారణం కూడా ఉంది..  అది ఏంటంటే కరోనా నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా తగ్గి.. ఓపెక్ దేశాలు ఉచితంగా చమురును సరఫరా చేసేందుకు సిద్ధం అయ్యాయి. కానీ దేశంలో ముడి చమురు నిల్వ చేసే రిజర్వ్ క్షేత్రాలన్నీ నిండిపోవడం, దేశంలో చమురు డిమాండ్ పడిపోవడంతో .. అదనపు చమురు నిల్వ చేసుకునే అవకాశం లేకపోయింది. సరఫరాలో అడ్డంకులు  తలెత్తనున్న  నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో12రోజుల పాటు వినియోగించేలా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి.

    2020 ఏప్రిల్–మే నెలల్లో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ కు రూ.5000కోట్లు ఆదా అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు తక్కువ ధరను సద్వినియోగం చేసుకుని 167లక్షల బారెళ్లను కొనుగోలు చేసిందని పెట్రోలియ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. దీంతో పాటు మూడు వ్యూహాత్మక భూగర్భ ముడి చమురు నిల్వలను పూరించడానికి రెండు దశాబ్దాలలోపు అంతర్జాతీయ చమురు ధరలను ఉపయోగించినట్లు తెలిపారు.  ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్.. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి మూడు ప్రదేశాల్లో భూగర్భ రాక్ గుహాల్లో వ్యూహాత్మక క్షేత్రాలను నిర్మించింది.

    Also Read: హైదరాబాద్ అతలాకుతలం.! జనజీవనం అస్తవ్యస్తం

    దేశంలో ప్రస్తుతం విశాఖ పట్టణం, మంగళూరు, పాడూరులలో ముడి చమురు భూగర్భ నిల్వ క్షేత్రాలు ఉన్నాయి. వీటి సామర్థ్యం 65లక్షల టన్నులు. వీటిలో  ఎప్పుడూ 53లక్షల టన్నులు నిల్వ ఉంటుంది. కాగా.. కొత్త క్షేత్రాలను ఒడిశా, కర్ణాటకల్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.