Modi: మోడీ సంచలనం.. వాట్సాప్, టెలిగ్రాం, జూమ్, గూగుల్ మీట్ కు షాకిచ్చిన కేంద్రం..

Modi: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంపార్టెంట్ పత్రాలు, సర్టిఫికెట్స్ పంపించేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లను వాడకూడదని స్పష్టం చేసింది. వీటి ద్వారా ధృవ పత్రాలను పంపిస్తే అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఉద్యోగులను హెచ్చరించింది మోడీ సర్కార్. ఈ యాప్‌లకు సంబంధించిన సర్వర్లు విదేశాల్లో ఉన్నందున ముఖ్యమైన సమాచారాన్ని వీటి ద్వారా పంపిస్తే హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదముందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం […]

Written By: Mallesh, Updated On : January 24, 2022 2:54 pm
Follow us on

Modi: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంపార్టెంట్ పత్రాలు, సర్టిఫికెట్స్ పంపించేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లను వాడకూడదని స్పష్టం చేసింది. వీటి ద్వారా ధృవ పత్రాలను పంపిస్తే అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఉద్యోగులను హెచ్చరించింది మోడీ సర్కార్.

PM Modi

ఈ యాప్‌లకు సంబంధించిన సర్వర్లు విదేశాల్లో ఉన్నందున ముఖ్యమైన సమాచారాన్ని వీటి ద్వారా పంపిస్తే హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదముందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేసే ఉద్యోగులంతా ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న వారంతా సమాచార మార్పిడి కోసం కేవలం ఈ ఆఫీస్ అప్లికేషన్ ( e- office applications)మాత్రమే ఉపయోగించాలని కేంద్రం స్పష్టంచేసింది.

Also Read: నో చర్చలు.. నోటీసులతో సమ్మెకు సై అంటున్న ఏపీ ఉద్యోగులు..

వర్చువల్ మీటింగ్స్‌కు సంబంధించి కూడా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారులు వర్చువల్ మీటింగ్స్ కోసం గూగుల్ మీట్, జూమ్ లాంటి ప్రైవేట్ యాప్స్ ను అస్సలు వాడొద్దని కేంద్రం ఆదేశించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(NIS) డెవలప్ చేసిన వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్స్ మాత్రమే ఉపయోగించాలని సూచించింది. వీటిని వినియోగిస్తున్నప్పుడు పాస్వర్డ్స్‌ను తప్పనిసరిగా వాడాలని తెలిపింది. ఇంకా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌ల వినియోగంపై కూడా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

PM Modi

దేశ భద్రతకు సంబంధించి నిర్వహించే కీలక సమావేశాలకు హాజరయ్యే సమయంలో అధికారులు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లను వెంట తీసుకురావొద్దని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రహస్య సమాచారం లీక్ కావడంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. జాతీయ కమ్యూనికేషన్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను ఈ యాప్స్ నిరంతరం ఉల్లంఘిస్తుండటంతో కేంద్రం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ ఆదేశాలను అన్ని మంత్రిత్వ శాఖల అధికారులు తప్పనిసరిగా పాటించాలని ప్రధాని మోడీ సర్కార్ స్పష్టం చేసింది.

Also Read: విరాట్ కోహ్లీ కూతురు ఫస్ట్ ఫొటో లీక్.. వైరల్.. ఎవరి పోలికో తెలుసా?

Tags