Narendra Modi: నేటి కాలంలో రాజకీయాలు జనాలకు రీచ్ కావాలంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. ఆ మ్యాజిక్ కూడా నటన మాదిరిగా అనిపించకూడదు. సహజత్వం నిండాలి. జనాలు మై మరిచిపోవాలి. సరిగా ఇదే పని చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
బెంగాల్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బిజెపిలో ఇది ఎప్పటినుంచో కొనసాగుతున్న సంప్రదాయం. అయితే ఈసారి నరేంద్ర మోడీ కొత్తగా ట్రై చేశారు. మరోసారి మమత బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందో అదే చేశారు. ఫలితంగా ఇన్నాళ్లపాటు మత తత్వ పార్టీ అని ముద్ర వేసుకున్న బీజేపీ.. బెంగాల్ ప్రజల మనసులో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకుంది.
ఇటీవల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు బిజెపికి గ్రాండ్ విక్టరీ అందించారు. 15 సంవత్సరాల మమత పరిపాలనకు చరమగీతం పాడారు. ఈ దేశానికి.. రాష్ట్రానికి సుస్థిరమైన పరిపాలన అందించాలంటే అది బిజెపి వల్ల సాధ్యమవుతుందని ప్రజలు స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్ ప్రజలకు సాష్టాంగ పడి నమస్కారం చేశారు.
సాధారణంగా ఇలాంటి పని 15 సంవత్సరాల కాలంలో మమత ఒక్కరోజు కూడా చేయలేదు. కనీసం ఆమె బెంగాల్ ప్రజల గురించి సరిగా పట్టించుకోలేదు. ఈ ప్యాక్ లాంటి సంస్థలు తన విజయానికి దోహదం చేస్తాయని నమ్మారు. చివరికి ప్రజలకు అనుకూలంగా ఉండలేక.. కొంతమంది వ్యక్తుల వల్ల బద్ద విరోధిగా మారిపోయి.. చివరికి తన స్థానాన్ని కూడా కోల్పోయారు. 15 సంవత్సరాల పాటు పాలించిన ముఖ్యమంత్రి తన స్థానాన్ని వరుసగా రెండుసార్లు (వేరువేరు నియోజకవర్గాలు)కోల్పోయి పరువు తీసుకున్నారు .
నరేంద్ర మోడీ సాష్టాంగ పడి నమస్కారం చేసిన తీరు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి విపరీతంగా సర్కులేట్ అవుతోంది.. అయితే నరేంద్ర మోడీ అలా పడింది ఏదో యాదృచ్ఛికంగా కాదు. దాని వెనుక బలమైన కారణం ఉంది. ఆ కారణం పేరు స్వామి వివేకానంద. బెంగాల్ రాష్ట్రంలో పుట్టిన ఆయన.. భారత సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు. తనకు ఎవరైనా సాష్టాంగ పడి నమస్కారం చేస్తే.. ఆయన కూడా అదే విధంగా చేసేవారు. ఫలితంగా పరస్పర గౌరవం అంటే ఎలా ఉంటుందో ఆయన చూపించేవారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అలానే చేయడంతో అందరూ ఫిదా అయిపోయారు. ఈ దెబ్బతో బెంగాల్ ప్రజల మనసును మరింత గొప్పగా చూరగొన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.