UP CM Adityanath Yogi: దేశంలో అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఈనేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి యూపీ కాబోయే సీఎం ఆదిత్యనాథ్ పై పడుతోంది. రాబోయే కాలంలో కాబోయే ప్రధానిగా యోగిని సూచిస్తున్నారు. దీనికి అమిత్ షా సైతం సహజంగానే అభివర్ణిస్తున్నారు. దీంతో యోగిపై గురుతర బాధ్యత ఉందని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారు.
బీజేపీలో ఉన్న సంప్రదాయం ప్రకారం 70 ఏళ్లు దాటిన వారికి కీలక పదవులు ఇవ్వరు. దీంతోనే ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి లాంటి వారు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ వయసు 71 ఏళ్లు కావడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు 73 ఏళ్లకు చేరుతుంది. ఈ కారణంగా ఆయన ప్రధాని పదవికి అనర్హులు అవుతారు. ఈ కారణంగా భావిభారత ప్రధాని ఎవరనే విషయంలో చాలా మంది నేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని అమిత్ షా కూడా సమ్మతిస్తున్నారు.
Also Read: ఇదో చరిత్ర: యూపీలో రెండోసారి బీజేపీ గెలవడానికి కారణాలివీ!
ఉత్తరప్రదేశ్ లో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి యోగి విధానాలు కూడా కారణంగా తెలుస్తోంది. అందుకే దేశంలో ప్రధాని పదవికి యోగినే అర్హుడిగా కొందరు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో యోగి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో యోగిపై కీలక బాధ్యతలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రాన్ని రోల్ చేసిన యోగి దేశాన్ని కూడా నడిపించగలరనే అభిప్రాయం అందరిలో వస్తోంది.
నరేంద్ర మోడీ రిటైర్మెంట్ ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు రాష్ట్రపతి పదవి ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మోడీ తరువాత అంతే స్థాయి నేతగా యోగి ఎదిగే అవకాశం ఉంది. దీంతో కాబోయే ప్రధాని యోగిగా భావిస్తున్నారు. యూపీలో యోగి సాధించిన విజయాలు పార్టీకి ప్లస్ కానున్నాయి. దీంతోనే అక్కడ బీజేపీ రెండోసారి అదికారంలోకి వచ్చింది. 37 ఏళ్ల తరువాత ఒకే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం జరిగిందంటే యోగి కృషి ఎంత ఉందో అర్థం అవుతోంది.
మోడీ వయసు నిబంధనల కారణంగా పీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ దృష్టి సారిస్తోంది. మరోవైపు అమిత్ షాకు కూడా అవకాశాలు ఉన్నాయి. దీంతో భవిష్యత్ ప్రధాని ఎవరనే దానిపై బీజేపీనే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ విధానాల మేరకు ఎవరిని ప్రధాని అభ్యర్థిగా చేస్తారో అంతుచిక్కడం లేదు.
Also Read: యూపీలో ఎంఐఎం వల్ల ఎస్పీ ఘోరంగా ఓడిపోయిందా? బీజేపీ గెలిచిందా?