Homeజాతీయ వార్తలుModi Bengal elections jhal muri video: బెంగాల్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ చేతిలో ఝల్...

Modi Bengal elections jhal muri video: బెంగాల్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ చేతిలో ఝల్ మురి.. గూగుల్ మొత్తం షేక్ అవుతోంది..

Modi Bengal elections jhal muri video: కాసేపు ఆ దూషణ రాజకీయాలను పక్కన పెడితే.. వ్యక్తిగత విమర్శలను దూరం పెడితే.. కొన్ని సందర్భాల్లో మన రాజకీయ నాయకులు చేసే పనులు గొప్పగా ఉంటాయి. అవి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాకపోతే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మన నాయకులు తమ ధోరణి మార్చుకోరు. తమ ప్రవర్తనను హుందాగా ఉండాలని కోరుకోరు. అదే మన దేశం చేసుకున్న దరిద్రం.

ఆ మధ్య జపాన్ ప్రధాని మన దేశానికి వచ్చారు. మనదేశంలో విస్తృతంగా పర్యటించారు. వచ్చిన అతిధికి కడుపునిండా భోజనం పెట్టడం భారతీయ సంస్కృతి. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ ప్రధానమంత్రి కి గోల్ గప్పా అనే గుజరాతి వంటకాన్ని వడ్డించారు. దీంతో ఆ వంటకం గురించి గూగుల్ లో చాలామంది సెర్చ్ చేశారు. అంతేకాదు, అది దొరికే ప్రాంతాలకు వెళ్లి బ్రహ్మాండంగా లాగించారు. మఖాన గురించి కూడా ఆ మధ్య ప్రధానమంత్రి ప్రస్తావించారు. స్వయంగా అతను తింటానని పేర్కొన్నారు. దీంతో మఖానా అమ్మకాలు పెరిగిపోయాయి. బీహార్ రాష్ట్రంలో మఖాన తయారీదారులకు ఇప్పుడు చేతినిండా పని దొరికింది. కేంద్రం కూడా సహకారం అందిస్తుండడంతో.. అక్కడ మఖాన తయారీ పరిశ్రమలు వర్ధిల్లుతున్నాయి.

తాజాగా బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేపథ్యంలో ఓ కిరాణా షాపులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఝల్ మురి తిన్నారు. తను తినడం మాత్రమే కాకుండా.. ఇంకా కొన్ని ప్యాకెట్లు కొని పక్కన ఉన్న చిన్నారులకు పంచిపెట్టారు. దీంతో దాని గురించి గూగుల్లో సెర్చింగ్ మొదలైంది. ఏకంగా లక్షలకొద్దీ సెర్చింగ్స్ ను నమోదు చేసింది. ప్రధానమంత్రి ఈ వీడియో ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశార. దీంతో వంద మిలియన్ల వ్యూయర్షిప్ లభించింది. ఆ వంటకం గురించి సెర్చింగ్ కూడా మొదలైంది.. బెంగాల్ రాష్ట్రంలో మరమరాలు, పచ్చిమిర్చి, మసాలాలు, ధనియాల పొడి, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు తో దీనిని తయారు చేస్తారు. ఇది నోటికి పుల్లగా, కారంగా, ఉప్పగా తగులుతూ ఉంటుంది. ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది.

ఝల్ మురి వంటకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తినడం.. మిగతా వాళ్లకు పంచి పెట్టడంతో.. అది కాస్త ట్రెండింగ్ గా మారింది. బిజెపి నాయకులు నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన నేపథ్యంలో.. దాని గురించి గూగుల్ లో విపరీతంగా సెర్చింగ్ నమోదైన క్రమంలో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ట్రెండ్ సెట్టర్ కాదని.. అతను ఒక ట్రెండ్ లాంటివాడని పేర్కొంటున్నారు. కాకపోతే నరేంద్ర మోడీ చేసిన ఈ పనిని ఎన్నికల స్టంట్ అని తృణమూల్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular