Venkaiah Naidu- Modi: ఎన్డీయే రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక ఖాయంగానే కనిపిస్తోంది. కానీ ఉపరాష్ట్రపతి విషయంలో ఓ కొత్త వాదన తెరపైకి వస్తోంది. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10 తో పూర్తి కావడంతో తరువాత అభ్యర్థి కోసం ఎన్డీయే వెతుకులాట మొదలెట్టింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ అమరీందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇది వెంకయ్య నాయుడుకు షాకే. ఇన్నాళ్లు ఉపరాష్ట్రపతి ఆయనే అని ప్రచారం సాగినా చివరకు మాత్రం అమరీందర్ పేరు ప్రముఖంగా వెలుగులోకి రావడంతో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

పంజాబ్ లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీ స్థాపించారు .దీంతో పరాజయం పాలయ్యారు. కానీ ప్రస్తుతం తన పార్టీని బీజేపీలో కలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై సీనియర్ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పంజాబ్ లో బీజేపీకి పట్టు కావాలని భావిస్తున్న తరుణంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ సేవలు అవసరమని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: Naga Chaitanya- Nagarjuna: నాగార్జున చేసిన పొరపాటు వల్ల రిస్క్ లో పడ్డ నాగచైతన్య కెరీర్
అమరీందర్ సింగ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. వెన్నెముక శస్త్ర చికిత్స కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. లండన్ నుంచి తిరిగొచ్చాక ఆయనతో చర్చలు జరిపి ఆ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో అమరీందర్ స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసి బీజేపీలో చేరేందుకు రెడీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరీందర్ చేరిక ఖాయంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో వెంకయ్య నాయుడు పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.

కెప్టెన్ అమరీందర్ సింగ్ సేవలు బీజేపీ ఉపయోగించుకోవాలని చూస్తోంది. పంజాబ్ లో బీజేపీకి పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్న సందర్భంలో అమరీందర్ రాక పార్టీకి ఎంతో అవసరం ఉందని తెలుస్తోంది. దీంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ రాకతో బీజేపీ ప్రతిష్ట మరింత పెరగనుందని భావిస్తోంది. భవిష్యత్ లో పార్టీని గాడిలో పెట్టేందుకు బీజేపీ ఉద్దేశించింది. ఇందులో భాగంగానే అమరీందర్ సింగ్ సేవలు ఇలా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనిపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. మొత్తానికి బీజేపీలో మాత్రం సమూల మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
Also Read:Actress Meena Husband Assets: హీరోయిన్ మీనా భర్త ఆస్తుల వివరాలు చూస్తే నోరెళ్లబెడుతారు
[…] […]
[…] […]