https://oktelugu.com/

Farmers: రైతులను ఆకర్షిస్తున్న మోదీ.. తత్వం బోధపడిందా?

Farmers: బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక దూకుడు పెంచింది. సంస్కరణ పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెల్సిందే. అయితే వీటి వల్ల కార్పొరేట్లకు తప్ప సామాన్య ప్రజానీకానికి పెద్దగా ఉపయోగం లేదనే వాదనలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా రైతుల కోసం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. అయినప్పటకీ మోదీ సర్కార్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గిన దాఖల్లేవు. ఏడాదికాలంగా రైతులు ఢిల్లీ కేంద్రంగా ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. తొలుత పంజాబ్ రైతులు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 2, 2021 / 03:22 PM IST
    Follow us on

    Farmers: బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక దూకుడు పెంచింది. సంస్కరణ పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెల్సిందే. అయితే వీటి వల్ల కార్పొరేట్లకు తప్ప సామాన్య ప్రజానీకానికి పెద్దగా ఉపయోగం లేదనే వాదనలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా రైతుల కోసం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. అయినప్పటకీ మోదీ సర్కార్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గిన దాఖల్లేవు.

    Modi with farmers

    ఏడాదికాలంగా రైతులు ఢిల్లీ కేంద్రంగా ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. తొలుత పంజాబ్ రైతులు మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో యూపీ, హర్యానా రైతులు కలిశారు. ఆ తర్వాత ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలంతా రైతులకు అండగా నిలిచి ఉద్యమానికి సహాయ సహకారాలు చేశారు.

    ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రైతు చట్టాలపై వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రైతులు ప్రధానంగా కనీస మద్దతు ధరను బిల్లులో పెట్టాలని కోరారు. దీనికి బీజేపీ ససేమిరా అనడంతో ఉద్యమం కొన్ని నెలలపాటు కొనసాగింది. అయితే ఉన్నట్లుండి మోదీ సర్కారు గతంలో పార్లమెంట్ లో పెట్టిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

    అంతేకాకుండా రైతులు కోరుతున్నట్లుగా కనీస మద్దతు ధరకు చట్టాన్ని చేసేందుకు ఓ కమిటీని సైతం నియమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కనీస మద్దతు ధరను నిర్ణయించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈనేపథ్యంలో రైతులు సైతం కేంద్రం ముందు మరిన్ని డిమాండ్లు పెడుతున్నారు.

    ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను క్యాబినేట్ నుంచి బర్తరఫ్ చేసి ఆయనపై కేసు పెట్టాలని రైతులు కోరుతున్నారు. వీటన్నింటినీ చేయడానికి మోదీ సర్కారు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలను పంపుతోంది.

    Also Read: 10,000 రూపాయలతో లక్షల్లో సంపాదిస్తున్న రైతు.. ఎలా అంటే?

    రైతుల డిమాండ్లకు మోదీ సర్కారు తలొగ్గడం వెనుక యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికలే కారణమని తెలుస్తోంది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ అధికారం కోల్పోతే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడుతుంది. ఇదే కనుక జరిగితే మోదీకి ఇబ్బందులు ఎదురవడం ఖాయమని బీజేపీ భావిస్తోంది. దీనిలో భాగంగా రైతులు అడిగిన డిమాండ్లన్నింటికీ కేంద్రం తలొగ్గుతుందని తెలుస్తోంది.

    ప్రస్తుతం బీజేపీకి రైతుల చట్టాల కంటే కూడా యూపీలో గెలువడమే ప్రధానం. దీంతో మోదీ సర్కారు రైతుల పట్ల తన వైఖరిని మార్చుకుందని తెలుస్తోంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే మాత్రం రైతుల మద్దతు తప్పనిసరని బీజేపీ గుర్తించింది. అందుకనుగుణంగా పార్లమెంట్ లో కొత్త చట్టాలను చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. రైతుల ఓ మెట్టు దిగిన బీజేపీ సర్కారును ప్రజలు ఏమేరకు ఆదరిస్తారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    Also Read: ఈ పసుపు సాగుతో ఎకరాకు 14 లక్షలు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే?