Akhanda Movie: ‘అఖండ’ అఖండమైన విజయానికి అదే కారణం !

Akhanda Movie: తెలుగు బాక్సాఫీస్ నిండా ఇప్పుడు ‘జై బాలయ్య’ నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి బాలయ్య బాబు సినిమాలు అంటే..ఈ మధ్య క్రేజ్ కాస్త తగ్గింది గాని, ఇరవై ఏళ్ల క్రితం బాలయ్య సినిమాలు అంటే.. అదొక జాతర. ఆ జాతర మళ్లీ అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా కనిపించింది. ఇప్పుడు హార్డ్ కొర్ ఫ్యాన్స్ అంతా అఖండ టైటిల్ తో పాటు జై బాలయ్య అంటూ పచ్చబొట్లును వేయించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య […]

Written By: Shiva, Updated On : December 2, 2021 7:37 pm
Follow us on

Akhanda Movie: తెలుగు బాక్సాఫీస్ నిండా ఇప్పుడు ‘జై బాలయ్య’ నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి బాలయ్య బాబు సినిమాలు అంటే..ఈ మధ్య క్రేజ్ కాస్త తగ్గింది గాని, ఇరవై ఏళ్ల క్రితం బాలయ్య సినిమాలు అంటే.. అదొక జాతర. ఆ జాతర మళ్లీ అఖండ సినిమా రిలీజ్ సందర్భంగా కనిపించింది. ఇప్పుడు హార్డ్ కొర్ ఫ్యాన్స్ అంతా అఖండ టైటిల్ తో పాటు జై బాలయ్య అంటూ పచ్చబొట్లును వేయించుకుంటున్నారు.

Akhanda Movie

ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఏ హీరోకి లేవు. మొత్తానికి బాలయ్యకి సాలిడ్ హిట్ వచ్చింది. బాలయ్య అఖండ సినిమాకు మొదటి నుండి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలను అందుకోవడంలో బోయపాటి తడబడ్డాడేమో గానీ, బాలయ్య మాత్రం అదరగొట్టాడు. ఎప్పటిలాగే బోయపాటి సినిమా లాగే ఈ సినిమా కూడా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగింది.

కానీ, ఆ పవర్ ఫుల్ యాక్షన్ లో ఎమోషన్ కూడా ఉంది. ఆ ఎమోషన్ లో డెప్త్ ఉంది. అన్నిటికీ మించి బాలయ్య నట విశ్వరూపం ఉంది. పైగా బోయపాటి – బాలయ్య కలయికలో సినిమా అంటేనే.. అదొక బీభత్సమైన యాక్షన్ డ్రామా. అది దృష్టిలో పెట్టుకునే… ముఖ్యంగా తమ కాంబినేషన్ కు ఉన్న మార్క్ చెడిపోకుండా బోయపాటి సినిమాను మలిచిన విధానం బాగుంది.

Also Read: Akhanda Telugu Movie Review : ‘అఖండ’ మూవీ రివ్యూ

అయితే, కేవలం యాక్షన్ కారణంగానే అఖండ సినిమా హిట్ అయింది అనలేం. అఘోర అంటూ ఓ కొత్త మార్క్ ను అందుకోవటానికి ప్రయత్నిస్తూ.. బోయపాటి ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా చూపించాడు. అందుకే, సినిమాలో బాలయ్య తన రొటీన్ డైలాగ్స్ అండ్ యాక్షన్ తో విచ్చలవిడిగా ఫైట్లు చేసినా మధ్యమధ్యలో అఘోరాగా చెప్పిన మాటలు చాలా బాగున్నాయి.

ఏది అయితే ఏం.. అఖండ సినిమా బాలయ్య అభిమానులను ఫుల్ గా అలరిస్తోంది. బలమైన ఎమోషన్ తో వెరీ ఎమోషనల్ గానూ అదేవిధంగా చాలా వైవిధ్యంగానూ ఉంది. అందుకే అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఇవన్నీ దృష్టలో పెట్టుకుంటే అఖండ సినిమా హిట్ అవడానికి కారణం.. బీభత్సమైన యాక్షనూ అద్భుతమైన ఎమోషనే మెయిన్ కారణం.

Also Read: Akhanda: థియేటర్​లో బాలయ్య ఫ్యాన్స్​కు షాక్​.. ‘అఖండ’ సినిమా ఆపేసి పోలీసులు వార్నింగ్​

Tags