KCR vs MODI: ధాన్యం కొనుగోలుపై రైతులను అయోమయానికి గురి చేస్తున్న కేసీఆర్ కు కేంద్రం షాక్ ఇచ్చినట్లయింది. ఇంతకాలం కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అందువల్ల వచ్చే యాసంగికి కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ రైతుల్లో కేంద్రంపై వ్యతిరేకతను రగిల్చారు. అంతేకాకుండా కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేవరకూ పోరాడుతామని అన్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలు చేయాలని పార్లమెంటులో ఆందోళన చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ వివరాలతో సహా చెప్పి టీఆర్ఎస్ కథ అంతా బూటకమని ఎండగట్టారు.. దీంతో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంది తప్పేం లేదని తేటతెల్లమైంది.. కేంద్రం బట్టలిప్పి నడిబజారులో నిలబెట్టేలా ఆధారాలతో సహా చూపడంతో ఇప్పుడు ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లు వరిధాన్యం కొనుగోలు చేసి ఇప్పుడు కొనమంటోందని కేసీఆర్ ప్రెస్ మీట్లో ఆరోపించారు. ధాన్యం కొనేవరకు పోరాటాలు చేస్తామని అన్నారు. ఇందులో భాగంగానే ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేశాడు. అంతేకాకుండా ఢిల్లీ వేదికగా తేల్చుకుంటామని మంత్రులతో సహా ఢిల్లీ వెళ్లి కేసీఆర్ జాతీయ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. అయితే మంది మార్బలంతో వెళ్లినా కేసీఆర్ ను కేంద్రం పట్టించుకోలేదని, ధాన్యం కొనమని కేంద్రం చెబుతోందని కేసీఆర్ అన్నారు. ఢిల్లీ పర్యటన తరువాత ప్రెస్ మీట్లో ఈ మేరకు కేంద్రం తీరును ఎండగట్టారు. దీంతో యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్టమని తేల్చారు.
ఇదే విషయంపై టీఆర్ఎస్ నాయకులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ధాన్యాన్ని కొనాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే కే కేశవరావు అడిగిన ప్రశ్నకు ఆహార మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణ ప్రభుత్వం ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పాం. ఈ మేరకు సీఎం కేసీఆర్ తో కూడా మాట్లాడాం. వర్షాకాలం పంటను పూర్తిగా కొంటామని తెలిపాం. అయితే ఖరీఫ్ లో 50 లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు 32.66 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చింది. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 27 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ వచ్చింది. ఇంకా 17 లక్షల టన్నులు పెండింగ్లోనే ఉన్నాయి.’ అని తెలిపారు.
భవిష్యత్ లో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనమని తెలంగాణ సర్కార్ కు ముందుగానే చెప్పామని, ఇందుకు కేసీఆర్ అంగీకారం తెలుపుతూ అక్టోబర్ 4న లేఖ కూడా రాశారని పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ ధాన్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రాజకీయం చేస్తుందో అర్థం కావట్లేదని ఆహారమంత్రి ఎండగట్టారు. ధాన్యంపై తప్పు అంతా తెలంగాణ సర్కార్ దేనని కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో కేసీఆర్ దీనిపై విధంగానే స్పందించలేదు. దీంతో ఆయన స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
బీజేపీ నాయకులు మాత్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి అసలు నిజం చెప్పాలని టీఆర్ఎస్ కొత్త డిమాండ్ మొదలుపెట్టింది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.కానీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొత్తం తప్పు కేసీఆర్ సర్కార్ దేనని మోడీ సర్కార్ పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టి గట్టి షాక్ ఇచ్చినట్టైంది.
అటు కేంద్రం.. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కాడి వదిలేయడంతో వానాకాలం పంటను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తేమ పేరుతో ధాన్యం కొనేందుకు వెనుకడుగు వేయడంతో చాలా మంది రైతులు తమ ధాన్యాన్ని ఇంకా కల్లాల్లోనే ఉంచుకుంటున్నారు. ఇలా రెండు ప్రభుత్వాల రాజకీయంలో పట్టుదలలో వ్యవహారంలో రైతులే నిండా మునుగుతున్నారు.