GST Removal Insurance: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి దశాబ్దం దాటింది. దేశ జీడీపీ గణనీయంగా పెరిగింది. ప్రంపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా భారత్ ఆవిష్కరించింది. అయితే ఇదే సమయంలో దేశంలో అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు 20014కు ముందు దేశంలో లీటర్ పెట్రోల్ రూ.70 ఉండగా, ఇప్పుడు రూ.110కి చేరింది. ఇక బంగారం ధర రూ.50 వేలు ఉండగా ఇప్పుడు లక్ష దాటింది. మోదీ సర్కార్ వివిధ సేవలకు కూడా పన్నులు వసూలు చేయడం ప్రారంభించింది. జీఎస్టీ పేరుతో భారీగా పన్నులు పెంచేవారు. అయితే ఇన్నాళ్లకు ప్రధాని మోదీ పన్నుల తగ్గింపుపై దృష్టిపెట్టారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జీఎస్టీని సంస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చాలా వరకు ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత జీవిత మరియు ఆరోగ్య బీమా పాలసీలపై విధించే జీఎస్టీని తొలగించేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదన ద్వారా సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గడమే కాక, బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఊరటనిస్తుంది. ఆరోగ్య, జీవిత బీమా రంగంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది.
Also Read: 200 లక్షల కోట్లు.. దేశ ప్రజలకు మోడీ ఏం సమాధానం చెబుతారు?
జీఎస్టీ భారం నుంచి ఉపశమనం
2017లో ‘ఒకే దేశం, ఒకే పన్ను‘ నినాదంతో ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం, వస్తు సేవలన్నింటిపై ఏకరీతి పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. అయితే, బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ విధించడం సామాన్యులకు ఆర్థిక ఒత్తిడిని కలిగించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలనే కేంద్రం నిర్ణయం సామాన్యులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. ఈ చర్య బీమా పథకాలను మరింత సరసమైనదిగా మార్చి, ఎక్కువ మంది ప్రజలు బీమా సౌకర్యాన్ని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక జీఎస్టీ రాబడిపై గణనీయమైన ప్రభావం చూపనుంది. అంచనాల ప్రకారం, ఈ మినహాయింపు వల్ల సుమారు 9,700 కోట్ల రూపాయల ఆదాయ నష్టం ఏర్పడవచ్చు. అయినప్పటికీ, ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా బీమా రంగంలో పెరిగే డిమాండ్, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర మంత్రులు ఈ ప్రతిపాదన ప్రయోజనాలు వినియోగదారులకు పూర్తిగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు, దీనికి సంబంధించిన అంశాలను జీఎస్టీ మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
బీమా రంగంలో సానుకూల మార్పులు
బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ తొలగింపు వల్ల పాలసీల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇది ఆరోగ్య, జీవిత బీమా పథకాలను మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు మరింత అందుబాటులోకి తెస్తుంది. గతంలో జీఎస్టీ భారం కారణంగా బీమా తీసుకోవడానికి వెనుకాడిన వారు ఇప్పుడు ఈ సౌకర్యాన్ని ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం దేశంలో బీమా చొచ్చుకొని వెళ్లే రేటును పెంచడంతోపాటు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భద్రతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: అరెస్టు అయితే ఔట్.. పీఎం, సీఎం పదవులు వదులుకోవాల్సిందే!
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు ద్వారా సామాన్యులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక, బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. ఈ చర్య ప్రజల ఆరోగ్య భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించే దిశగా ఒక ముందడుగు.