
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో దేశంలోని అన్ని రంగాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక ప్రకటనలు చేస్తోంది. తాజాగా కేంద్రం జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2018 – 19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ రిటర్న్స్ కు డిసెంబర్ 31 వరకు గడువును పొడిగించింది. మొదట కేంద్రం అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే జీఎస్టీ రిటర్న్స్ కు అనుమతి ఇవ్వగా తాజాగా ఆ గడువును పొడిగించటం గమనార్హం.
దేశంలోని చాలామంది వ్యాపారులకు కేంద్రం నిర్ణయం ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. డిసెంబర్ 31వ తేదీలోపు వ్యాపారులు తమ జీఎస్టీ రిటర్నస్ ను దాఖలు చేయవచ్ఛు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమర్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించింది. రీకన్సిలేషన్ స్టేట్‌మెంట్, వార్షిక రిటర్న్స్ సమర్పించడానికి సంబంధించి చాలా వినతులు వచ్చాయని పేర్కొంది.
ఆ వినతులను పరిశీలించి మరో రెండు నెలలు గడువు పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందరి వినతులను పరిశీలించి అంగీకారం తెలిపినట్టు సీబీఐసీ అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం కేంద్రం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువును కూడా పొడిగించిన సంగతి తెలిసిందే.
2019 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరం రిటర్నులను ఈ నెల 31వ తేదీలోగా దాఖలు చేయవచ్చని వెల్లడించింది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.