ఎంతో ఇంట్రెస్టింగ్.. ఆ వార్త చూడగనే నిజమనిపించేలా ఎడిటింగ్.. ఆసక్తికరమైన రచన.. తీరా తెలుసుకుంటే ఆ వార్త అబద్ధం. ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితి ఇలానే ఉంది. ముఖ్యంగా దేశంలో ఎప్పుడైనా కోవిడ్ 19 మహమ్మారి వెలుగు చూసిందో అప్పటి నుంచి మరీ ఎక్కవయ్యాయి. నిజం కాని వార్తలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ‘మెరిసేది అంతా బంగారం కాదు’ అన్నట్లు.. అలా వచ్చిన వార్తలను నమ్మకపోవడమే మంచిది.
Also Read: మోడీతో జగన్.. ఏం ఏం చర్చించారంటే?
ప్రస్తుతం యూట్యూబ్ వీడియో ఒకటి ఇలానే హల్‌చల్ చేస్తోంది. ‘ప్రధాన మంత్రి మాన్‌ధన్ యోజన’ కింద అకౌంట్లు ఉన్న వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం రూ.3,000 చొప్పున ఇస్తోందని ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత అని తెలుసుకుంటే అదంతా ఫేక్ అంట. అసలు కేంద్రం అలాంటి ప్రకటనే చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఒక ట్వీట్‌లో స్పష్టం చేసింది.
ఆ ట్వీట్ ప్రకారం.. ‘ప్రధాని మాన్‌ధన్ యోజన కింద అకౌంట్లు ఉన్న వారందరికీ రూ.3000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటూ యూ ట్యూబ్ వీడియో ఒకటి క్లెయిమ్ చేసింది. ఈ క్లెయిమ్‌లో నిజం ఎంతమాత్రం లేదు. ఇదో నకిలీ వార్త. ఇలాంటి ఏ స్కీమ్ కింద కూడా ప్రభుత్వం రూ.3000 చెల్లించడం లేదు’ అని పేర్కొంది.
Also Read: హత్రాస్ మరువక ముందే తెలంగాణలో మరో దారుణం
ఇంటర్నెట్‌లలో ఇలాంటి ఫేక్ ముఠా ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫేక్ సమాచారం వైరల్ చేస్తూనే ఉంది. అయితే.. వీటికి కళ్లెం వేసేందుకు 2019లో పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ వింగ్ ప్రారంభమైంది. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఫేక్ వార్తలపై నిర్ధారణ చేసేందుకే ఈ విభాగం పనిచేస్తోంది. అది ఎంతలా కట్టడి చేయాలని చూస్తున్నా ఆగడం లేదు. ఈ నేపథ్యంలో నకిలీ వార్తలను ఎవరూ షేర్ చేయవద్దని, పూర్తిగా నిర్ధారణ చేసుకున్నాకే షేర్ చేయాలని సూచించింది.