తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ కాసేపట్లో విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ పరీక్ష కోసం 1.43 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.30 లక్షల మంది హాజరయ్యారు.
Also Read: రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ షాక్..?
అయితే.. కరోనా పరిస్థితుల దృష్ట్యా చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్‌కు హాజరుకాలేకపోయారు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మరోసారి పరీక్ష నిర్వహిస్తోంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 14 మధ్య కరోనా వైరస్ సోకి పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ రోజు విడుదల చేయనున్న ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరుచనున్నట్లు పాపిరెడ్డి చెప్పారు.
విద్యార్థులు TSCHE అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఫలితాలు ఎలా తెలుసుకోవాలి.. ఆ సైట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం.
TSEAMCET 2020 అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
TSEAMCET 2020 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. నేరుగా రిజల్ట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
Also Read: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?