Modi- Gautam Adani: మోడీ సుద్దపూసేం కాదు
*శ్రీలంక మన్నార్ హైడల్ పవర్ ప్రాజెక్టు విషయంలో అవినీతి మరకలు
*అదాని కోసం వత్తిడి తెచ్చారని ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ ఫెర్టినాండో ఆరోపణలు
*తోసిపుచ్చిన ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే
*అదే సమయంలో అదాని గ్రూపునకు అనుకూలంగా విద్యుత్ చట్టం లో సవరణలు
….
సంక్షుభిత శ్రీలంకలో మరో దుమారం చెలరేగింది. భారత ప్రధాని మోదీ, దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దోస్తానా ఆ దేశంలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. పొరుగు దేశం శ్రీలంకలో మన్నార్ లో 500 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించే విండ్ పవర్ ప్రాజెక్ట్ ( గాలి ఆధారిత) కాంట్రాక్ట్ ఎటువంటి పోటీ లేకుండా గౌతమ్అదాని కి కట్టబెట్టాలని ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు గొట్టబయ రాజ పక్స పై ఒత్తిడి తెచ్చారని, సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్టినాండో ఆరోపించడం ఇప్పుడు దుమారం లేపుతోంది. ఈ వాఖ్యలను గొట్టబయ వ్యతిరేకిస్తున్నప్పటికీ..ఆ దేశం అదాని తో కుదుర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.

…
అసలు ఏం జరిగిందంటే..
…
మన్నార్లో 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలని శ్రీలంక నిర్ణయించింది. ఇందులో భాగంగానే నిర్మాణ బాధ్యతలు, నిర్వహణ అదాని గ్రూప్ న కు 25 ఏళ్లకు అప్పగించింది. ఇందుకు ఎంవోయూ కూడా కుదుర్చుకున్నది. ఎంవోయూ ఆ సమయంలోనే ప్లాంట్ లో తయారయ్యే యూనిట్ విద్యుత్ ను 6.50 అమెరికన్ సెంట్లకు సీఈబీకి విక్తయించేలా ఒప్పందం కుదిరింది. కానీ కొంత కాలానికి ఈ ధరను 7.55 అమెరికన్ సెంట్ల కు పెంచింది. దీనిపై శ్రీలంక ఇంజనీర్లు మండిపడుతున్నారు. ప్లాంట్ నిర్మాణానికి అంతర్జాతీయస్థాయిలో బిడ్లను కనుక ఆహ్వానించి ఉంటే యూనిట్ ధర నాలుగు అమెరికన్ సెంట్ లకే వచ్చేదని వారు చెబుతున్నారు. ఇప్పుడు దాదాపు రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. పోటీ అనేది లేకపోవడంతో ఆదానీ గ్రూప్ నకు ఇరవై ఐదేళ్ల కాలానికి నాలుగు అమెరికన్ బిలియన్ డాలర్ల లబ్ధి చేకూరుతుందని వారు ఆరోపిస్తున్నారు.
…
ఇలా వెలుగులోకి వచ్చింది
…
శ్రీలంకలో సంప్రదాయ వనరుల ఆధారంగా నిర్మించే మౌలిక ప్రాజెక్టులపై ఆ దేశ పార్లమెంటు కు చెందిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ విచారణ జరుపుతోంది. కమిటీ ఎదుటకు సి ఈ బి చైర్మన్ ఫెర్టినాండో హాజరయ్యారు. మన్నార్ ఫ్లాట్ గురించి కమిటీ చైర్మన్ చరిత హెరాత్ ప్రశ్నించగా ” ఇది రెండు దేశాల మధ్య నేరుగా కుదిరిన డీల్. 2021 నవంబర్ 24 నాడు ప్లాంటు నిర్మాణం,నిర్వహణకు సంబంధించి అదానికి ఇవ్వాలని మోదీ నాపై ఒత్తిడి తెస్తున్నారని గొటబయ రాజపక్స నాతో చెప్పారని” ఫెర్టి నాండో కుండబద్దలు కొట్టారు. ఇక అప్పట్లో ఫెర్టి నాండో ఇచ్చిన వాంగ్మూలాన్ని శ్రీలంక న్యూస్ ఛానల్ ” ఫస్ట్ న్యూస్” ప్రసారం చేసింది. దీంతో ఆ దేశంలో కలకలం చెలరేగింది. అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలో ఈ ఒప్పందం మంటలు రాజేసింది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో గొటబయ రాజపక్స ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ కమిటీ ముందు ఫెర్టినాండో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, మన్నార్ విద్యుత్ ప్రాజెక్టును ఏ వ్యక్తి గాని ఏ సంస్థకు గాని అడ్డగోలుగా కట్టబెట్టడం లేదని ఆయన వివరించారు.
…
సవరణ ఎందుకు చేసినట్టు
…
అదాని గ్రూప్ నకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని గొటబయ చెబుతున్నా.. 1989 నాటి విద్యుత్ చట్టానికి సవరణలు చేయడంతో అసలు విషయం బయటపడింది. చట్ట సవరణ వల్ల అదాని
గ్రూపునకు ఎటువంటి పోటీ లేకుండా పోయింది. పోటీదారు లేకపోవడంతో ఆదాని గ్రూప్కు ఆయాచిత లబ్ది జరగనుంది. కాగా 1989 నాటి విద్యుత్ చట్టానికి చేసిన సవరణ బిల్లును శ్రీలంక పార్లమెంట్ ఆమోదించింది. ఈ ఆమోదంతో మన్నార్ ప్లాంట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యత ఆ దాని గ్రూప్కు చట్టబద్ధంగా జరిగిపోయింది. చట్ట సవరణ, మన్నారు ప్రాజెక్టు ఒప్పందంపై ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం సమగ జన బల వేగయ ( ఎస్ జే బీ వీ) నిరసన వ్యక్తం చేసింది. రాజపక్స కు ఆ దాని గ్రూప్ నుంచి ముడుపులు ముట్టాయని అందుకే ఈ ఒప్పందానికి తెరలేపింది అని ఆరోపించింది.
…
ఆస్ట్రేలియా బొగ్గు గనులు దక్కడం లోను మోదీ పాత్ర
…
మరోవైపు ఆస్ట్రేలియాలో ఆ దాని గ్రూప్కు బొగ్గుగనులు దక్కడం లోనూ మోదీ కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెల్బోర్న్, సిడ్నీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గనుల్లో ఇప్పుడు కీలక వాటా మొత్తం ఆ దాని గ్రూపు చేతిలో ఉంది. అక్కడ ఉత్పత్తి అయ్యే బొగ్గును ఖచ్చితంగా కొనాల్సిందేనని దేశంలోని విద్యుత్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదానీ గ్రూప్కు లబ్ధి చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకుంది. 2021 డిసెంబర్ నుంచి ఆస్ట్రేలియాలో ఆదానీ గ్రూపు బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది. 2022 ఏప్రిల్ 4న ఆస్ట్రేలియా నుంచి దిగుమతి బొగ్గుపై కేంద్ర ప్రభుత్వం సుంకాలు ఎత్తివేసింది. 2022 మే 21న ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు దిగుమతి అయ్యే బొగ్గుపై ఎక్సైజ్ డ్యూటీని 2.5 శాతం నుంచి 0 కు తగ్గించింది. 2022 జూన్ 4న 14 మిలియన్ టన్నుల బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవాలని కోల్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2022 జూన్ 6న ₹ 8,308 కోట్ల విలువైన ఆ దాని ఆస్ట్రేలియా బొగ్గు కోసం ఎన్టీ పీసీ టెండర్లు పిలిచింది.
ఇప్పుడైతే ఆ దాని గ్రూపు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తవ్వకాలు ప్రారంభించిందో అప్పటినుంచి ఆ కంపెనీ ముఖ షేర్ విలువ పెరగడం ప్రారంభించింది. ఇటీవల ఎల్ఐసి ఐపీవో కి వచ్చినప్పుడు ఆ సంస్థకు చెందిన షేర్లను కొన్నారు. తర్వాత ఇటీవల ట్రేడింగ్లో లక్ష కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైపోయింది. కానీ అదే సమయంలో ఆ దాని షేరు విలువ అంతకంతకూ పెరిగింది.
