Homeజాతీయ వార్తలుNarendra Modi Melody Chocolates: మోడీ క్రేజ్ అట్లుంటది మరీ.. దెబ్బకు పార్లే మెలోడీ ఎక్కడికో...

Narendra Modi Melody Chocolates: మోడీ క్రేజ్ అట్లుంటది మరీ.. దెబ్బకు పార్లే మెలోడీ ఎక్కడికో వెళ్లిపోయింది..

Narendra Modi Melody Chocolates: అప్పట్లో నరేంద్ర మోడీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి వెళ్లారు. దేశ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు.. విహారయాత్రలకు విదేశాలకు వెళ్లకూడదని.. మనదేశంలో ఉన్న ఇటువంటి ప్రాంతాలను సందర్శించాలని.. అప్పుడు పర్యాటకంగా దేశానికి ఆదాయం లభిస్తుందని.. స్థానికంగా ఉన్న వ్యక్తులకు ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ఆ మాట చెప్పడమే ఆలస్యం.. ఒక్కసారిగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కు పర్యాటకులు పెరిగిపోయారు. ఇదే సమయంలో మాల్దీవులు ప్రాంతానికి వెళ్లే పర్యటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. చివరికి ఆ దేశంలో ఆర్థికంగా సమస్యలు, రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరికి మాల్దీవులు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు నరేంద్ర మోడీ మరో సంచలనానికి నాంది పలికారు. ఇటలీలో ప్రకటించిన నరేంద్ర మోడీ.. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని కి అపురూపమైన కానుక ఇచ్చారు. ఆ కానుక పేరు మెలోడీ చాక్లెట్లు. దీంతో మెలోడీ చాక్లెట్లు మీడియాలో.. సోషల్ మీడియాలో విపరీతమైన సర్కులేషన్ లో ఉంది. మెలోని, మోడీ కలిసి మెలోడీ చాక్లెట్లను ఇచ్చుకుంటూ ఫోటోలకు ఫోజురించారు. దీంతో మెలోడీ బ్రాండ్ విలువ పెరిగిపోయింది.

సాధారణంగా మెలోడీ చాక్లెట్లను పార్లే కంపెనీ తయారుచేస్తోందని అందరూ అనుకుంటున్నారు. ఈ చాక్లెట్లకు పార్లే కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. పైగా ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో మెలోడీ చాక్లెట్లను తయారుచేసే పార్లే ప్రొడక్ట్స్ లిస్ట్ అవలేదు. మోడీ స్వయంగా మెలోనికి మెలోడీ చాక్లెట్లు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ బ్రాండ్ విలువ పెరిగిపోయింది. అయితే చాలామంది పార్లే ఇండస్ట్రీస్ మెలోడీ చాక్లెట్ తయారు చేస్తోందని అనుకున్నారు. కానీ ఆ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ కంపెనీ బిఎస్ఈ లో లిస్ట్ అయింది. ఇటీవల పునరుత్పాదక విభాగంలో కూడా ఈ కంపెనీ అడుగుపెట్టింది. వరుసగా రెండు రోజులపాటు పార్లే కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ అందుకున్నాయి. అయితే ఈ కంపెనీ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. స్టాక్స్ కొంతకాలంగా ఒడిదుడుకులకు గురవుతున్నాయి.. అయితే ఈ సంస్థ షేర్ ముఖ విలువ గత మూడు నెలల్లో 35% తగ్గింది. ఇక ఏడాది ప్రారంభంలో అయితే 41% తగ్గిపోయింది.

నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన తర్వాత ఈ కంపెనీ షేర్ విలువ పెరిగిపోయింది. అయితే కొంతకాలంగా నష్టాలు కలవరపెడుతున్న నేపథ్యంలో ఈ కంపెనీ తేరుకుంది. అప్పర్ సర్క్యూట్ ఇంకా కొద్దిరోజులపాటు సాగితే కంపెనీ కష్టాలు మొత్తం తీరుతాయని.. అయితే ఇప్పటికే మీడియాలో అసలు విషయం తెలియడంతో మదుపరులు ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు అని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version