Homeజాతీయ వార్తలుCockroach Janata Party: బీజేపీని మించిపోయిన కాక్రోచ్ జనత పార్టీ.. Gen z తరానికి...

Cockroach Janata Party: బీజేపీని మించిపోయిన కాక్రోచ్ జనత పార్టీ.. Gen z తరానికి కోపం వస్తే అంతే సంగతులు..

Cockroach Janata Party: ఒక వ్యక్తికి వచ్చే కోపం.. పదిమందికి వస్తే అది ఉద్యమంగా మారుతుంది. ఆ తర్వాత అనేక గళాలు దానికి తోడైతే అప్పుడు దాన్ని తీవ్రత మారిపోతూ ఉంటుంది. ఇటువంటి ఉద్యమాలు ఈ ప్రపంచంలో చాలా జరిగాయి. చాలా మార్పులకు కారణమయ్యాయి. వ్యక్తులను దించేశాయి. వ్యవస్థలను మార్చేశాయి. నిద్రాణమైన సమాజాన్ని చైతన్యవంతం చేశాయి. అందుకే ఆగ్రహం అనేది ఒక వ్యక్తిలో అర్థవంతంగా కలిగితే కచ్చితంగా అది వ్యవస్థను మారుస్తుందని నిపుణులు అంటుంటారు.

మనదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతను బొద్దింకలుగా పోల్చారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రచారం వేరే విధంగా మొదలైంది. కాక్రోచ్ అని సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు జనరేషన్ జెడ్ లో ఆగ్రహాన్ని కలిగించాయి. ఆ తర్వాత సామాజిక మాధ్యమాలలో క్యాంపెయిన్ మొదలైంది. ఆ ఉద్యమం ఇప్పుడు ప్రకంపనలకు దారితీస్తోంది.. ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటయింది. కాకపోతే అది సోషల్ మీడియాలో మాత్రమే. ఈ పార్టీకి వ్యవస్థాపకుడిగా అభిజిత్ దీప్కే

కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటుచేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఏకంగా 40 వేలకు మందికి పైగా సభ్యులు ఇందులో చేరారు. చివరికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ లు మహువ, కీర్తి ఆజాద్ ఇందులో చేరడం విశేషం.. ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా విపరీతమైన చర్చ నడుస్తోంది. ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మించిన స్థాయిలో ఈ పార్టీకి ఫాలోవర్స్ నమోదు కావడం విశేషం. పైగా ఈ పార్టీ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ పార్టీ అధికారంలోకి వస్తే మన దేశాన్ని బొద్దింకలు పరిపాలిస్తాయని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

సాధారణంగా మన సమాజంలో బొద్దింకలను హీనంగా చూస్తారు. సుప్రీం కోర్ట్ జడ్జి నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చి చెప్పడంతో జనరేషన్ జెడ్ లో ఆగ్రహం కలిగింది.. దీంతో సోషల్ మీడియాలో ఉద్యమం తారస్థాయిలో జరుగుతోంది. విపరీతమైన చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చ రాజకీయాల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో.. 2029 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నవ యువకులు ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version