Ram Charan Peddi Climax Twist: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ బుచ్చి బాబు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు , సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఆయన ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలే కనిపిస్తున్నాయి. సినిమా పై బజ్ పెంచడానికి ఈ ఇంటర్వ్యూలు చాలా బాగా కలిసొచ్చింది. నేడు రామ్ చరణ్, బుచ్చి బాబు ఒక డ్రైవ్ కి వెళ్తూ చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది , సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి రామ్ చరణ్ చెప్పిన మాటలు వింటే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అందరూ అప్పట్లో ‘ఉప్పెన’ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ ని చూసి షాక్ కి గురయ్యారు, కానీ ‘పెద్ది’ క్లైమాక్స్ ట్విస్ట్ ని చూసి ఏమైపోతారో , ఉప్పెన క్లైమాక్స్ ట్విస్ట్ కి వంద రెట్లు ఎక్కువ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. స్వయంగా హీరో నే క్లైమాక్స్ గురించి ఈ రేంజ్ లో చెప్పాడంటే , సినిమా ఎలా ఉండుంటుందో ఊహించుకోవచ్చు , రామ్ చరణ్ చెప్పినట్టుగా క్లైమాక్స్ ఆ రేంజ్ లో ఉంటే మాత్రం ‘రంగస్థలం’ ని మించిన బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , ఈ చిత్రం క్లైమాక్స్ లో రామ్ చరణ్ కి కాళ్ళు పోతాయని , అయినప్పటికీ కూడా ఆయన రన్నింగ్ రేస్ పోటీలలో పాల్గొంటాడని, ఆ సీక్వెన్స్ ప్రేక్షకుల రోమాలను నిక్కపొడిచేలా చేస్తుందని అంటున్నారు.
అంతే కాకుండా రామ్ చరణ్ కి ఈ చిత్రం లో బాగా నచ్చిన సన్నివేశాలేంటి అని బుచ్చి బాబు ఈ ఇంటర్వ్యూ లో అడగ్గా, నాకు ఢిల్లీ ఎపిసోడ్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఓవరాల్ గా వీళ్ళ మాటల్ని బట్టీ చూస్తుంటే ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉండబోతుందని, రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూస్తారని అంటున్నారు విశ్లేషకులు. జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శింపబడే ప్రీమియర్ షోస్ తోనే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు , దీనికి ఆడియన్స్ నుండి కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. రేపు ఈ చిత్రానికి సంబంధించిన ఐటెం సాంగ్ ని విడుదల చేయబోతున్నారు, ఈ ఐటెం సాంగ్ లో శృతి హాసన్ రామ్ చరణ్ తో కలిసి చిందులేసింది.
