Homeజాతీయ వార్తలుKavitha Kalvakuntla: ఎమ్మెల్సీగారు... ఏమిటిది? గ్యాంగ్‌రేప్‌పై స్పందించని కవిత!!

Kavitha Kalvakuntla: ఎమ్మెల్సీగారు… ఏమిటిది? గ్యాంగ్‌రేప్‌పై స్పందించని కవిత!!

Kavitha Kalvakuntla: కల్వకుంట్ల కవిత. పచియకం అక్కరలేని పేరు. దేశ వ్యాప్తంగా అమ్మాయిలు, మహిళలపై ఎక్కడ అఘాయిత్యం జరిగిన వెంటనే నిలదీస్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారు. ఒక వర్గాన్ని ఏమైనా అంటే ధర్నాలు చేయడానికి కూడా వెనుకాడరు. అదే స్వరాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కనీసం స్పందించరు. ఆమె మద్దతు ఇచ్చే ఒకవర్గంవారు చేసే ఇంకా అసలే పట్టించుకోరు. ఇందుకు తాజాగా మైనర్‌ బాలిక గ్యాంగ్‌రేప్‌ ఘటనే ఉదాహరణ. ఎమ్మెల్సీగా, సీఎం కేసీఆర్‌గా కాకపోయినా మహిళగా కూడా మానవత్వం చూపకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘మందిది మంగళారం.. మనది సోమవారం’ అన్న చందంగా ఉంది కవిత తీరు.

Kavitha Kalvakuntla
Kavitha

Also Read: KCR New party: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. పార్టీ పేరు ఇదే.. ఎప్పుడు లాంచ్ అంటే?

పది రోజులుగా పూజల్లో…

ఎమ్మెల్సీ కవిత ఏదైనా ఘటనపై స్పందిస్తే దానిపై అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపడుతుంది. కేసీఆర్‌ కూతురుగా ఆమెకు రాష్ట్ర అధికార యంత్రాంగా అంత ప్రాధాన్యం ఇస్తుంది. జూబ్లీ హిల్స్‌ గ్యాంగ్‌రేప్‌పై మంత్రి, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ స్పందించిన తర్వాతనే పోలీసుల్లో కదలిక వచ్చింది. ఈ క్రమంలో మహిళగా, కేసీఆర్‌ కూతురుగా, ఎమ్మెల్సీగా కవిత స్పందిస్తే బాధితురాలికి త్వరగా న్యాయం జరుగుతుందని, దోషులకు కఠిన శిక్ష పడుతుందని అందరూ ఆశించారు. అయితే కవిత పది రోజులుగా నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం చౌడమ్మకొండపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన రాజ్యలక్ష్మి సమేత శ్రీనృసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో పాల్గొన్నారు. పూజల్లో ఉన్నందున గ్యాంగ్‌రేప్‌పై స్పందించడం లేదని అంతా భావించారు. ముఖ్యంగా మహిళా సంఘాలు కవిత స్పందన కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పూజలు ముగిశాయి. ఈ నేపథ్యంలో కవిత వెంటనే గ్యాంగ్‌రేప్‌పై స్పందిస్తారని అంతా ఆశించారు. కానీ కనీసం ఆ ఘటన గురించి ఆమె మాట్లాడలేదు. ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉండే ఎమ్మెల్సీ అందులోనూ గ్యాంగ్‌రేప్‌పు ఖండిస్తూ, దోషులను శిక్షించాలని చిన్న పోస్టు కూడా చేయలేదు. కానీ, అంగన్‌వాడీ కార్యకర్తలకు కేటాయించేఉ బడ్జెట్‌లో 50 శాతం కోత విధించారని ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నిస్తూ ఓ పోస్టు చేశారు. దీనిని చూసిన నెటిజన్లు గ్యాంగ్‌రేప్‌పై స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. దోషులను మేజర్లుగానే పరిగణించాలని పోలీసులు కోర్టుకు విన్నవించడాన్ని మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్‌ స్వాగతించారు. కానీ, ఎమ్మేల్సీగా, మహిళగా, తల్లిగా, తెలంగాణ పౌరురాలిగా కూడా కవిత స్పందించకపోవడంపై మహిళా సంఘాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ఒక వర్గానికి కొమ్ముకాయడానికే కవిత ఇలా వ్యవహరిస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఆరోపిస్తున్నారు.

Also Read: KCR New party: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. పార్టీ పేరు ఇదే.. ఎప్పుడు లాంచ్ అంటే?

RELATED ARTICLES

Most Popular