https://oktelugu.com/

కొత్త వివాదం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కూతురు దొంగ ఓటు వేశారా?

నేడు జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు ముగియనుంది. ఉదయం 7గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకాగా ఓటర్లు మాత్రం మందకొడిగా కదిలారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల అధికారులు పకడ్బంధీ చర్యలు చేపట్టినా నగరవాసులు మాత్రం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలవైపు పెద్దగా చూడకపోవడం గమనార్హం. Also Read: ఈ బామ్మను చూసైనా.. నగరవాసులు మెల్కొంటారా? ఒకటి రెండు డివిజన్లలో మినహా మిగిలిన అన్ని డివిజన్లలో పోలింగ్ శాతం 25శాతానికి మించలేదని తెలుస్తోంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 1, 2020 / 05:40 PM IST
    Follow us on

    నేడు జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు ముగియనుంది. ఉదయం 7గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకాగా ఓటర్లు మాత్రం మందకొడిగా కదిలారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల అధికారులు పకడ్బంధీ చర్యలు చేపట్టినా నగరవాసులు మాత్రం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలవైపు పెద్దగా చూడకపోవడం గమనార్హం.

    Also Read: ఈ బామ్మను చూసైనా.. నగరవాసులు మెల్కొంటారా?

    ఒకటి రెండు డివిజన్లలో మినహా మిగిలిన అన్ని డివిజన్లలో పోలింగ్ శాతం 25శాతానికి మించలేదని తెలుస్తోంది. అయితే సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ వేసేందుకు సమయం ఉంది. అప్పటివరకు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లందరు కూడా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు.

    ఇదిలా ఉంటే సీఎం కూతురు.. ఎమ్మెల్సీ కవిత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం కొత్త వివాదానికి దారితీసింది. బంజారాహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రం ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తప్పుబట్టడంతోపాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

    Also Read: పార్టీలకు నగరవాసుల జలక్.. ఒక్కశాతం కూడా మించని ఓటింగ్..!

    ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్​లో ఓటుహక్కు ఉందని శోభన్ తెలిపారు. అక్కడ ఓటు ఉండగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవిత రెండో ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. సాక్ష్యాత్ సీఎం కూతురే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ దొంగ ఓటు వేయడం ఎంతవరకు సమంజమన్నారు. ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు కవితపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన లేఖను కాంగ్రెస్ విడుదల చేసింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్