Telugu states: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా వస్తుండటంతో నేతల్లో సందడి నెలకొంది. ఒకటి తరువాత మరొకటి ముందుకు వస్తుండటంతో నాయకులు బిజీగా మారుతున్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే హవా అయినా కాంగ్రెస్ పోటీలో ఉండటంతో ఆలోచనలో పడింది. తమ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

గతంలో హుజురాబాద్, బద్వేల్ లలో ఉప ఎన్నికలు జరిగాయి. హుజురాబాద్ లో బీజేపీ, బద్వేల్ లో వైసీపీ విజయం సాధించాయి. దీంతో తెలుగు స్టేట్లలో రాజకీయ సమీకరణలు మారనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీలు కూడా తమ శక్తి యుక్తులను ప్రదర్శిస్తున్నాయి. ఒక వైపు టీఆర్ఎస్, మరోవైపు వైసీపీ లు అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది.
ఈ నేపథ్యంలో రాజకీయంగా బలపడేందుకు పావులు కదుపుతున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. అధికారం కోసం అన్ని దారులు వెతుకుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే బీజేపీపై టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరుకు దిగుతోంది. ధాన్యం కొనుగోలును అంశంగా చేసుకుని కేంద్రంపై దుమ్మెత్తిపోస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ లో భయం పట్టుకుందని తెలుస్తోంది.
Also Read: TRS: టీఆర్ఎస్కు ఇంత భయమా.. అందుకే క్యాంపు రాజకీయాలు?
మరోవైపు తెలంగాణలో అధికారం కోసం శ్రమించాలని కేంద్ర హోం మంత్రి తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ర్టంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. నేతలకు దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపుతూ వారిని సిద్ధం చేయాలని చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ పరిణామాలు తెలుగు స్టేట్లలో మారుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.