spot_img
Homeజాతీయ వార్తలుఎమ్మెల్యే రాసలీలలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

ఎమ్మెల్యే రాసలీలలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

నవ్వేటోని ముందట జారిపడ్డట్టే ఉన్నది ప్రస్తుతం హుజూరాబాద్‌లో ఓ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యం. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ప్రచారానికొచ్చిన ఓ ఎమ్మెల్యే ఏకంగా మకాం ఏర్పాటు చేసుకుని ఓ మహిళా ప్రజాప్రతినిధిని ట్రాప్‌ చేసి రాసలీలు కొనసాగిస్తున్నట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ప్రచారం దగ్గర పడుతుంటే ప్రజలను కలవాల్సిందిపోయి రాత్రయితే చాలు కార్యకర్తలకు దూరంగా, ఆ మహిళకు దగ్గరగా ఓ ఇంట్లో ఈ తతంగాన్నంతా నడిపిస్తున్నట్టు నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నట్టు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది.
MLA
అధికార, ప్రతిపక్ష పార్టీలు వారి మంత్రులను, ఎమ్మెల్యేలను ఒక్కో మండలానికి ఇన్‌చార్జులుగా నియమించాయి. గత మూడు నెలలుగా అక్కడే ఇండ్లను అద్దెకు తీసుకుని రోజూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సాయంత్రం ప్రచార సరళిని సమీక్షిస్తుంటారు. ఇలానే జమ్మికుంటకు వచ్చిన ఓ ఎమ్మెల్యే స్థానిక నాయకులతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ట్రాప్‌ చేసినట్టు భోగట్టా. రాష్ట్రస్థాయి పదవి ఆశజూపి ఆమెతో రాసలీలలు కొనసాగిస్తున్నారని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. రోజూ రాత్రి 8 దాటాక కార్యకర్తలకు దూరంగా ఉంటుండటం వల్ల ఈ వ్యవహారం బయటికొచ్చినట్టు కార్యకర్తలే చెబుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న వేళ దృష్టి సారించాల్సిన ఇన్‌చార్జి ఎమ్మెల్యే ఇలా పరస్త్రీ వ్యామోహంతో పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరును కార్యకర్తలే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా ఇంటిలిజెన్స్‌ వర్గాలకు తెలియడంతో అధిష్టానానికి సైతం ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం. దీంతో అగ్ర నేతలు ఆ ఎమ్మెల్యేపై సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో మహిళలతో శారీరక సంబంధాలు ఏర్పరుచుకున్నట్టు కార్యకర్తలు చెబుతున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper