https://oktelugu.com/

రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే… చంద్రబాబు అంగీకరిస్తాడా..?

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నాయుడు గత కొన్ని నెలలుగా షాకుల మీద షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ప్రజలు విశ్వసించడం ఎప్పుడు మానేశారు. 2024 ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకుంటుందా…? అనే ప్రశ్నకు ఆ పార్టీ నేతలకే సమాధానం తెలియట్లేదు. అధికార పార్టీపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదు. విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ రెండు రోజుల క్రితం వైసీపీలో తన కుమరులను […]

Written By: , Updated On : September 23, 2020 / 08:05 PM IST
Follow us on

chandrababu

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నాయుడు గత కొన్ని నెలలుగా షాకుల మీద షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ప్రజలు విశ్వసించడం ఎప్పుడు మానేశారు. 2024 ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకుంటుందా…? అనే ప్రశ్నకు ఆ పార్టీ నేతలకే సమాధానం తెలియట్లేదు. అధికార పార్టీపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదు.

విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ రెండు రోజుల క్రితం వైసీపీలో తన కుమరులను చేర్చడంతో పాటు వైసీపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వాసుపల్లి గణేష్ అధికార పార్టీకి మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు, టీడీపీ నేతలు ఒకింత షాక్ కు గురయ్యారు. ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే నలుగురు అధికార పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారని.. మిగతా ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మద్దతు ఇస్తే టీడీపీ పరిస్థితేంటని టీడీపీ వర్గాల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి తరుణంలో వాసుపల్లి గణేష్ నేడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జరగని పనులు జగన్ హయాంలో జరుగుతున్నాయని.. దేశంలో 14 నెలల పాలనలో సంక్షేమ పథకాల కోసం ఏ పార్టీ కూడా 59 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని అన్నారు. జగన్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా చేశారని చెప్పారు.

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి నిర్మాణాత్మక సూచనలు చేయాలని కానీ రాష్ట్రంలో అలా జరగడం లేదని తెలిపారు. మనస్సు చంపుకుని టీడీపీలో ఉన్నానని.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి మనుగడ లేదని… పేదలకు జగన్ లైఫ్ ఇచ్చాడని చెప్పారు. మరి వాసుపల్లి గణేష్ రాజీనామా విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.