YCP coverts: వైసీపీ కోవర్టులపై ఎమ్మెల్యే రోజా ‘జబర్దస్తీ’..!

YCP coverts: నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా రూటే సపరేటు అన్నట్లుగా రాజకీయాల్లో దూసుకెళుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచి నగరి నియోజకవర్గంలో రోజా సత్తాచాటారు. ప్రత్యర్థి పార్టీలను తన వాగ్దాటితో చీల్చి చెండాడే రోజా సొంత పార్టీల నేతల నుంచే ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటుండటం సర్వత్రా  చర్చనీయాంశంగా మారుతోంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే రోజా సొంత పార్టీకి చెందిన నేతలతో నిత్యం తగాదాలకు దిగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. పెద్దిరెడ్డి వర్గానికి చెందిన కొందరు […]

Written By: NARESH, Updated On : December 31, 2021 4:28 pm
Follow us on

YCP coverts: నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా రూటే సపరేటు అన్నట్లుగా రాజకీయాల్లో దూసుకెళుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచి నగరి నియోజకవర్గంలో రోజా సత్తాచాటారు. ప్రత్యర్థి పార్టీలను తన వాగ్దాటితో చీల్చి చెండాడే రోజా సొంత పార్టీల నేతల నుంచే ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటుండటం సర్వత్రా  చర్చనీయాంశంగా మారుతోంది.

YCP coverts

గత కొంతకాలంగా ఎమ్మెల్యే రోజా సొంత పార్టీకి చెందిన నేతలతో నిత్యం తగాదాలకు దిగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. పెద్దిరెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలు నియోజకవర్గంలో తనకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని రోజా ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రోజాకు సొంత పార్టీ నేతలే తనకు రాజకీయంగా ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే రోజా కన్నీటి పర్యాంతమైన సంగతి అందరికీ తెల్సిందే.

Also Read: అటు మరీ తక్కువ, ఇటు మరీ ఎక్కువ.. చిన్న సినిమాలకు దారేది ?

ఆ తర్వాత పెద్దిరెడ్డి వర్గం కొంత వెనక్కి తగ్గినట్లు కన్పించింది. అయితే గత కొద్దిరోజులుగా  వైసీపీ నుంచి సస్పెండ్ చేయబడిన నేతలు రోజాను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించడమే లక్ష్యంగా వారంతా వ్యూహాలు రచిస్తున్నారు. ఈక్రమంలోనే ఆమెకు పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

తనపై రాజకీయంగా కుట్రలు పన్నుతున్న వారిపై రోజా సైతం అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు. పార్టీ అధిష్టానం నుంచి పెద్దగా సపోర్టు లభించకపోయినా వైసీపీలోనే కోవర్టులపై దూకుడుగా వెళుతున్నారు. ఈక్రమంలోనే నిత్యం నియోజకవర్గంలో వీరిమధ్య వార్ నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రోజా నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి వైసీపీ కోవర్టులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

వైసీపీకి చెందిన కొంతమంది టీడీపీకి కోవర్టులుగా మారిపోయి తనకు రాజకీయంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే రోజా చిత్తూరు ఎస్పీ సెంధిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఫొటోలు వేసుకొని ఫ్లెక్సీలు వేసుకొని అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.గతంలో వైసీపీలో ఉంటూ సస్పెండ్ అయిన వాళ్లు తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీరిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ప్రజల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో ఏవైనా గొడవలు ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి గానీ ఇలా పోలీసు స్టేషన్ కు వెళ్లడం ఏంటనే కామెంట్లు విన్పిస్తోంది.

ఏదిఏమైనా రాజకీయాల్లో ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లడం చూస్తుంటే పార్టీలో ఆమెకు ఉన్న ప్రాధాన్యం ఏంటో అర్థమవుతోందని వైసీపీ నేతలు గుసగుసలు లాడుతున్నారు. ఈ లెక్కన ఆమెకు మంత్రి పదవీ ఏమోగానీ వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీటు అయినా ఉంటుందా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Also Read:  ఆర్ నారాయణమూర్తి ఎక్కడ ? ఆరా తీస్తున్న పెద్ద నిర్మాతలు !