Jagga Reddy vs YS Sharmila: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెచ్చిపోయారు. తనను రాజకీయ వ్యభిచారి అని విమర్శించిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై పరుజ పదజాలంతో పరువు తీసేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను వ్యభిచారి అంటావా? నేను అదే మాట నిన్ను అంటే… శీలం గురించి నువ్వు మాట్లాడకు.. ఇంకో సారి నన్ను అంటే ఊరుకోను.. పద్దతి దాటి తే కుల్లం కల్లం మాట్లాడతా… ఏం తమాషాలు చేస్తున్నావా ..? బుద్ది ఉందా నీకు? ఆడపిల్ల ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు.. ఒళ్లు దగ్గర పెట్టుకో.. మళ్ళీ నోరు జారితే నీ గురించి చాలా విషయాలు చెప్తా ఇది వార్నింగ్ మళ్ళీ రిపీట్ చేస్తే… చాలా డెప్త్ విషయాలు చెప్తా … అందరికీ బలహీనతలు ఉంటాయి… అన్నీ చెప్తా’’ నంటూ జగ్గారెడ్డి ఓ రేంజ్ లో షర్మిలపై విరుచుకుపడ్డారు.

‘షర్మిల పాదయాత్ర కాదు కాళ్ళు చేతులు కొట్టుకున్నా తెలంగాణ లో గెలవలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యనే పోటీ అని.. బీజేపీ కె అర్దం అవ్వడం లేదు ఎట్లా పోవాలి అనేది అని విమర్శించారు. తెలంగాణ లో అనవసర న్యూసెన్స్ చేస్తున్నది షర్మిల.. అమ్మాయి కదా అని ఏం అనలేక పోతున్నాం. మళ్ళీ మా నాయకుడు వైఎస్ బిడ్డ కదా అని ఆలోచన చేస్తున్నాం.. షర్మిల కి నాతో పంచాయితీ ఎందొ అర్దం అవ్వడం లేదు. కెటిఆర్ కి కోవర్ట్ అని నింద వేశారు షర్మిల.. ఆమె వ్యవహరం చుట్టరికం తోక పట్టుకొని తిరిగినట్టు ఉంది.. ’ అంటూ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.
Also Read: Janasena Chief Pawan Kalyan: ఆ ముగ్గురు నేతల కోసం పవన్ కల్యాణ్ భారీఫైట్‌కు రెడీ?
అర్జెంట్ గా షర్మిల సీఎం అయిపోవాలి అదే ఆమె కోరిక అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ‘విజయమ్మ కి సలహా ఇస్తున్న.. జగన్ కి చెప్పి షర్మిలను సీఎం చేయండి.. మీ ఇంటి పంచాయితీ జనం కి చుట్టకండి.. ఏపీ లో మూడు రాజధానుల పంచాయతీ నడుస్తుంది.. మీ ఇంట్లో సీఎం ల పంచాయితీ కోసం ఇక్కడ పంచాయితీ పెట్టకండి… మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి ’ అంటూ సెటైర్లు వేశారు. జగన్ మోడీకి గులాం అయ్యారు కాబట్టి మూడు రాష్ట్రాలు చేయండి. మి ఫ్యామిలీ అంతా మోడీ దగ్గర కూర్చొని ..మూడు రాష్ట్రాలు చేసుకోండి . అమరావతి కి జగన్ సీఎం , కడప,కర్నూల్ కి వై ఎస్ షర్మిల , వైజాక్ కి విజయసాయి రెడ్డి సీఎం గా చేసుకోండి అంటూ హితవు పలికారు..
* ఊరు మీద పడతా అంటే ఎట్లా.. కెటిఆర్ కో వర్ట్ అని షర్మిల.. మా పార్టీ వాళ్ళు అన్నారు.. ఇది నాకు శాపం అయ్యింది Ktr అప్పాయింట్ మెంట్ కూడా దొరకదు నాకు అంటూ జగ్గారెడ్డి విమర్శించారు. . కోవర్ట్ అనే అంశంలో మా పార్టీ వాళ్ళే ఎక్కువ బదనం చేశారు
. ఇంకా షర్మిలను ఏం అంటామని నిలదీశారు. నేను అన్ని మతాలకు సమన్వయ కర్తను షర్మిల లెక్క బీజేపీ కి ఏజెంట్ నీ కాదు నన్ను ఇంకా అంటే… మాత్రం చాలా విషయాలు చెప్పాలి వస్తది అంటూ హెచ్చరించారు.

షర్మిల..జగన్ మధ్య ఆస్తుల పంపకం కూడా కానట్టుంది… నేను trs లో ఉన్నప్పుడే పులి లెక్క ఉన్నా మున్సిపల్ ఎన్నికల్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే రిగ్గింగ్ చేసి మూడు మున్సిపాలిటీ లు trs గెలిపించిన.. . నా దమ్ము చూసి నన్ను వైఎస్ పిలిచాడు కాంగ్రెస్ లోకి వైఎస్ కి నేను నచ్చినా ..షర్మిల కు నచ్చలేదు అంటే షర్మిలకు రాజకీయ పరిజ్ఞానం లేదు అని అర్దం అంటూ జగ్గారెడ్డి పాత విషయాలు తీసి మరీ ఎండగట్టాడు.
‘షర్మిల నోరు అదుపులో పెట్టుకో.. వైఎస్ మోతే బరి…కానీ నువ్వు కాదు.. శత్రువు వచ్చినా ఆత్మీయత చుపెడతరు.. వైఎస్ గుణాలు షర్మిలకు లేవు.. షర్మిల లెక్క చిల్లర ముచ్చట్లు వైఎస్ దగ్గర లేవు.. ముమ్మాటికీ షర్మిల బీజేపీ కోవర్టు.. నేను ప్రజా సమస్యల పై ప్రజలకు వారధిగా ఉంటా.. షర్మిల మతపరమైన బీజేపీ కి కోవర్టుగా ఉంది’ అంటూ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.
Also Read: BJP- NTR Health University: ఎన్టీఆర్ పేరుపై వివాదంలో బీజేపీకి ఎదుకంత హుషారు?
[…] Also Read: Jagga Reddy vs YS Sharmila: శీలం గురించి నువ్వు మాట్లా… […]
[…] Also Read: Jagga Reddy vs YS Sharmila: Don’t talk about Seelam Sharmila.. you will reveal everything.. Ma… […]
[…] Also Read: Jagga Reddy vs YS Sharmila: శీలం గురించి నువ్వు మాట్లా… […]