https://oktelugu.com/

నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ అమరవతినే రాజధానిగా కొనసాగించాలని, కరోనా సాయం రూ. 5 వేలు చెల్లించాలని, పలు ఇతర సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు నివాసాల్లోనే 12 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి మద్దత్తుగా ఆ పార్టీకి చెందిన నాయకులు వారి ఇళ్లలోనే దీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కృష్ణా జిల్లా మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విజయవాడలో బెంజిసర్కిల్ సమీపంలోని వారి నివాసంలో ఉదయం 9 […]

Written By: , Updated On : April 13, 2020 / 07:44 PM IST
Follow us on


రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ అమరవతినే రాజధానిగా కొనసాగించాలని, కరోనా సాయం రూ. 5 వేలు చెల్లించాలని, పలు ఇతర సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు నివాసాల్లోనే 12 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి మద్దత్తుగా ఆ పార్టీకి చెందిన నాయకులు వారి ఇళ్లలోనే దీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కృష్ణా జిల్లా మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విజయవాడలో బెంజిసర్కిల్ సమీపంలోని వారి నివాసంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా సాయం ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు అందించడం, అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని, చంద్రన్న బీమా పథకం కొనసాగిఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోవైపు రాజధానిని అమరావతిలో కొనసాగించాలంటూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామలోని తన నివాసంలో 12 గంటల దీక్ష చేపట్టారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఆంధ్రప్రదేశ్ ని మంచి అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని నమ్మబలికి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా పరిపాలనను కొనసాగిస్తున్నాడని విమర్శించారు.

రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైయ్యారని చెప్పారు. ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే జగన్ మాత్రం తాను నిర్ణయించుకున్న ముహూర్తానికి రాజధానిని తరలించాలని చూస్తున్నాడని చెప్పారు.