మహేష్ స్పీడుకు కరోనా బ్రేక్..

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా విజయాలతో దూకుడు మీద ఉన్న సంగతి తెల్సిందే. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. తాజాగా మహేష్ నటించిన ‘సరిలేరునీకెవ్వరు’ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరునీకెవ్వరు’ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ అందించిన విజయంతో మహేష్ కొన్నిరోజులు ఫ్యామిలీతో విదేశాలకు విహారయాత్రకు వెళ్లిచ్చొన సంగతి తెల్సిందే. దీంతో మహేష్ తదుపరి మూవీపై […]

Written By: Neelambaram, Updated On : April 13, 2020 7:33 pm
Follow us on


సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా విజయాలతో దూకుడు మీద ఉన్న సంగతి తెల్సిందే. ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. తాజాగా మహేష్ నటించిన ‘సరిలేరునీకెవ్వరు’ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరునీకెవ్వరు’ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ అందించిన విజయంతో మహేష్ కొన్నిరోజులు ఫ్యామిలీతో విదేశాలకు విహారయాత్రకు వెళ్లిచ్చొన సంగతి తెల్సిందే. దీంతో మహేష్ తదుపరి మూవీపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

విదేశాలను నుంచి వచ్చాక మహేష్ కొత్త మూవీ స్టార్ అవుతుందని అందరూ భావించారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడటంతో మహేష్ మూవీ పట్టాలెక్కలేదు. కాగా మహేష్ తో మూవీ చేసే దర్శకుడి పేరు ఇంకా ఖరారు కాకపోవడం మరింత ఆసక్తిని రేపుతోంది. మహేష్-దర్శకుడు పర్శురాం కాంబినేషన్లో మూవీ రానుందని ప్రచారం జరుగుతుంది. అలాగే వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తారని గాసిప్స్ విన్పిస్తున్నాయి.

‘సరిలేరునీకెవ్వరు’ మూవీ పూర్తికాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించాల్సి ఉండేది. దర్శకుడు వంశీ స్క్రిప్ట్ లేట్ చేయడంతో ఈ మూవీ పక్కన పడినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ దర్శకుడు పర్శురాం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ పూర్తికాగానే త్రివిక్రమ్ మూవీతో స్టార్ కానుంది. అదేవిధంగా దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పూర్తికాగానే మహేష్ తో రాజమౌళి మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టిన మహేష్ కు కరోనా ఎఫెక్ట్ దెబ్బకొట్టింది. ఈ ఏడాది వరుస సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన మహేష్ కు కరోనా రూపంలో ప్లాన్ రివర్స్ అయింది. వరుసపెట్టి సినిమా చేద్దామనుకున్న మహేష్ బాబు స్పీడుకు కరోనా బ్రేక్ వేసినట్టయింది.