స్థైర్యం కల్పించని మంత్రుల బస..!

విశాఖ ఆర్.ఆర్ వెంకటాపురం పరిసర గ్రామాల ప్రజల్లో ఇప్పటి భయాందోళనలు తొలగలేదు. ప్రమాదం జరిగి ఐదు రోజులు అయినా భాదితులను దుర్ఘటన తాలూకు గుర్తులు వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎంపీ బాధిత గ్రామాల్లో బస చేసినా స్థానికుల్లో మానసిక స్థైర్యం కలగలేదు. 10 వేల మందికిపైగా రాత్రి పునరావాస కేంద్రాల్లోనే గడిపారు. కేవలం వెయ్యి మంది గ్రామాల్లోకి వచ్చినా వారు సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో వచ్చిన వారిలో సగం మంది వెనక్కి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో […]

Written By: Neelambaram, Updated On : May 12, 2020 3:01 pm
Follow us on

విశాఖ ఆర్.ఆర్ వెంకటాపురం పరిసర గ్రామాల ప్రజల్లో ఇప్పటి భయాందోళనలు తొలగలేదు. ప్రమాదం జరిగి ఐదు రోజులు అయినా భాదితులను దుర్ఘటన తాలూకు గుర్తులు వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎంపీ బాధిత గ్రామాల్లో బస చేసినా స్థానికుల్లో మానసిక స్థైర్యం కలగలేదు. 10 వేల మందికిపైగా రాత్రి పునరావాస కేంద్రాల్లోనే గడిపారు. కేవలం వెయ్యి మంది గ్రామాల్లోకి వచ్చినా వారు సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో వచ్చిన వారిలో సగం మంది వెనక్కి వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు రాత్రి బస చేశారు. వెంకటాపురంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, పద్మనాభనగర్ లో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎల్.జి కంపెనీ వున్న పరిసర గ్రామంలో మరో మంత్రి కన్నబాబు, సమీప గ్రామంలో ఎంపీ విజయసాయి రెడ్డి రాత్రి బస చేశారు. అన్ని రాకల పరీక్షలు పూర్తి చేశామని గ్రామాల్లో ఉండటానికి ఎటువంటి ఇబ్బంది లేదని, నివాసం ఉండే సమయంలో తీసుకోవాల్సిన చర్యలు అక్కడి ప్రజలకు వివరించినట్లు మంత్రులు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లిన కొద్దిమంది మూసిఉన్న ఇళ్ల తలుపులు తెరిచే సరికి వచ్చిన స్టైరీన్ వాసనతో కొందరు వాంతులు చేసుకోగా, మరికొందరికి కడుపులో తిప్పినట్లు  ఉండటం వంటి లక్షణాలు చోటు చేసుకున్నాయి. వాసన కారణంగా  ఐదు రోజుల కిందట తెల్లవారుజామున చోటు చేసుకున్న దుర్ఘటన వారి కళ్ళ మందు కదలాడింది. దీంతో ఒక్కసారిగా వారు ఉద్వేగానికి గురయ్యారు. వచ్చిన వారిలో చాలా మంది తిరిగి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు.
బాధిత గ్రామాల్లో మంత్రుల బస ఓ పార్సుగా అక్కడి టిడిపి నాయకులు కొట్టిపారేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం, ప్లాస్టిక్ ప్రరిశ్రమ అత్యవసర పరిశ్రమగా అనుమతివ్వడం వంటి అంశాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టిందని వారి వాదన.