Minister Roja: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు రోజుకి ఒక కొత్త మలుపుని తీసుకుంటుంది..ఈరోజు వరుకు పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ఎంత హాట్ టాపిక్ గా మారిందో..రాజకీయాల్లో ఎలాంటి అలజడి ని సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైజాగ్ వదిలి వెళ్లిపోతుండడం తో గొడవ సర్దుకుంది అనుకునే లోపు,మంత్రి రోజా ఇచ్చిన లేటెస్ట్ వాట్సాప్ ఆడియో మెసేజ్ ఇప్పుడు కలకలం రేపుతోంది.

రోజా కి తన సొంత నియోజగవర్గం లో ఎప్పటి నుండో సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ఉంది..ప్రభుత్వం చేపట్టే ఎన్నో కార్యక్రమాలను రోజా గారిని పిలవకుండానే పార్టీలోని వ్యతిరేక వర్గం పనులు కానిచ్చేవారు..వైసీపీ పార్టీ లోకి ఆమె అడుగుపెట్టినప్పటి నుండి ఇలాంటివి జరుగుతూనే వస్తున్నాయి..అయితే ఇప్పుడు ఆమె మంత్రి అయినప్పటికీ కూడా ఆ వర్గం ఇప్పటికి ఆమెని అవమానిస్తుంది..లేటెస్ట్ గా ఆమె పెట్టిన ఒక వాట్సాప్ ఆడియో మెసేజ్ వింటే సొంత పార్టీ లో ఆమెకి జరుగుతున్నా అవమానాలు ఎలాంటివో అర్థం అవుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే నేడు నగరి నియోజకవర్గం లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు..ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి రోజా గారిని పిలవకుండానే ఆమె వ్యతిరేక వర్గం పనులు పూర్తి చేసేసింది..ఈ విషయం తెలుసుకున్న రోజా చాలా తీవ్రమైన అసహనం కి గురై ఒక వాట్సాప్ మెసేజ్ ని మీడియా కి విడుదల చేసింది.

ఆమె మాట్లాడుతూ ‘పార్టీ కి ఇన్ని రోజులు నేను ప్రాణం పెట్టిమరీ పని చేశాను..కానీ సొంత పార్టీ లోనే నాకు తరుచు ఘోరమైన అవమానాలు జరుగుతుంది..నగరి నియోజకవర్గం లో జనాల్లో నాపై పూర్తిగా వ్యతిరేకతను సొంత పార్టీ వారే పెంచుతున్నారు..అంతే కాకుండా టీడీపీ మరియు జనసేన పార్టీ వారు నన్ను చూసి నవ్వుకునేలా నా ప్రతిష్టని దిగజారుస్తున్నారు..మంత్రి హోదాలో ఉన్న నన్ను , ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న రైతు భరోసా కార్యక్రమం నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా జరిగిపోవడం ఏమిటి..ఇంత మెంటల్ టెన్సన్స్ మధ్యన రాజకీయాలు చెయ్యడం చాలా కష్టం..ఇలాగె చేస్తే నేను రాజీనామా చేసి రాజకీయాల నుండి పూర్తి గా తప్పుకుంటాను’ అంటూ రోజా ఇచ్చిన ఆ ఆడియో మెసేజ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
