
Minister Malla Reddy: బీఆర్‌ఎస్‌లో కామెడీ లీడర్.. తెలంగాణలో కామెడీ మంత్రి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మల్లారెడ్డి. ఈయన ఏది చేసినా నవ్వులు మాత్రం ఖాయం.. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చినా.. పార్టీ సమావేశాల్లో ప్రసంగించినా.. మీటింగ్‌లులో మాట్లాడినా.. కాలేజీ విద్యార్థులకు మోటివేషన్ క్లాస్‌లు చెప్పినా పిచ్చ కామెడీ మాత్రం ఖాయం. చివరకు ఆయనే అంగీకరించారు.. ‘నేను ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది’ అని అట్లుంటది మల్లనతో.. తాజాగా మంత్రిగారు మళ్లీ ఏసేశారు.
ఐటీ దాడులపై ఎక్స్‌పీరియన్స్..
మంత్రి మల్లారెడ్డిపై ఇటీవల ఐటీ రైడ్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మామూలు రచ్చ చేయలేదు. తన కొడుకును కొట్టారని ఒకసారి, ఐటీ అధికారుల లాప్‌టాప్ అపహరించి మరోసారి.. సుమారు 5 రోజుల ఐటీ దాడిని రక్తికట్టించారు అమాత్యుల వారు. తాజాగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన మంత్రిగారిని ఐటీ దాడుల గురించి అడిగారు. ఈ సందర్భంగా ఆయన తనకు ఐటీ దాడులపై ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మీకు అనుభం లేదు.. నాకు అనుభవం ఉంది అని పేర్కొన్నారు..
2094 ఐటీ దాడులట..
ఇక ఐటీ దాడుల అనుభవం వివరిస్తూ మంత్రిగారు మళ్లీ ఏసేశారు. తనపై 2094 ఒకసారి ఇన్‌కం ట్యాక్స్ దాడి అయిది ఒకసారి.. అప్పుడు ఆరేళ్లు తిరిగి. మళ్లీ 2008లో ఇంకోసారి అయింది అంటూ తన నోటికి వచ్చింది మాట్లాడారు.

నెట్టింట్లో వైరల్..
ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఏది పడితే అది మాట్లాడడం మల్లారెడ్డికి అలవాటే. ఈ క్రమంలో ఐటీ దాడులపై అనుభవం చెబుతానంటూ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఒక కామెడీ సీన్ జోడించి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram