https://oktelugu.com/

టీఆర్ఎస్ డిమాండ్: కేసీఆర్ ప్రధానమంత్రి కావాల్సిందేనట..

ప్రధాని నరేంద్రమోడీకి సరితూగే నేత ఎవరు అని దేశమంతా వెతికితే రాహుల్ గాంధీ పేరు ఎవరూ చెప్పరు. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేదంటే తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు చెబుతారు. అయితే ఎవ్వరు ఏమనుకున్నా కానీ ప్రధాని కావాలన్న ఆశ శ్వాస అటు కేసీఆర్ లో ఉంది. ఇటు టీఆర్ఎస్ కేడర్ లో ఉంది. పోయినసారి బీజేపీకి సీట్లు రాక హంగ్ వస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేవారే. కానీ జస్ట్ మిస్ […]

Written By: , Updated On : March 25, 2021 / 07:17 PM IST
Follow us on

ప్రధాని నరేంద్రమోడీకి సరితూగే నేత ఎవరు అని దేశమంతా వెతికితే రాహుల్ గాంధీ పేరు ఎవరూ చెప్పరు. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేదంటే తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు చెబుతారు. అయితే ఎవ్వరు ఏమనుకున్నా కానీ ప్రధాని కావాలన్న ఆశ శ్వాస అటు కేసీఆర్ లో ఉంది. ఇటు టీఆర్ఎస్ కేడర్ లో ఉంది. పోయినసారి బీజేపీకి సీట్లు రాక హంగ్ వస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేవారే. కానీ జస్ట్ మిస్ అయ్యింది.

అయితే ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలిచే అవకాశం లేదని.. ధరల పెంపు, ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు దోచిపెట్టడం లాంటి విమర్శల నేపథ్యంలో వచ్చేసారి బీజేపీకి సీట్లు తగ్గి ప్రాంతీయ పార్టీల అవసరం తప్పనిసరి అవుతుందని అందరూ భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఇప్పుడు కొత్త డిమాండ్ వినిపిస్తోంది. ‘తెలంగాణ సీఎం కేసీఆర్.. ఒకసారి దేశానికి ప్రధాని కావాలి’ అని అసెంబ్లీ సాక్షిగా మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేయడం విశేషం.

తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి ఈ మేరకు తన ఆకాంక్షను బయటపెట్టాడు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని చెప్పుకొచ్చారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల్లోనే కేసీఆర్ తెలంగాణలో చరిత్ర సృష్టించాడని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించిన వ్యక్తం కేసీఆర్ అని ప్రశంసించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వారు చిన్నప్పటి నుంచి అవే పథకాలు రన్ చేస్తున్నారని.. ఏదో మభ్యపెట్టి కాలం గడుపుతున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డి ప్రసంగం ముగియగానే అటు కేటీఆర్, ఇటు హరీష్ రావులు భళ్లున నవ్వేశారు. కామెడీతో మల్లారెడ్డి చేసిన ప్రసంగం మొత్తానికి నవ్వులు పూయించింది.

కేసీఆర్ పీఎం.. కేటీఆర్ సీఎం అన్న నినాదాన్ని బలంగా తీసుకెళ్లాలన్నది గులాబీ నేతల మనసులో మాట.. అయితే ఇన్నాళ్లుగా ప్రజాబలం లేక మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు బీజేపీ వ్యతిరేకపవనాలు చూసి మెళ్లిగా గలం విప్పడం మొదలుపెట్టారు. వచ్చేఎన్నికల నాటికి ఎలాగైనా సరే ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ పీఎంను చేసేదాకా గులాబీ శ్రేణులు విశ్రమించరు కావచ్చు. చూద్దాం మరీ ఏం జరుగుతుందో..