మొన్నటికి మొన్న హైదరాబాద్ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల బాలికపై నిందితుడు రాజు హత్యాచారం చేసిన వ్యవహారంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. హత్యాచారం జరిగి పెద్ద వివాదం కాగానే ‘నిందితుడు రాజు’ను పోలీసులు అరెస్ట్ చేశారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్న కేటీఆర్ చేసిన ట్వీట్ నిజమేనని అనుకున్నారు. నిందితుడు రాజు ఏడి అని పోలీసులను కోరగా.. ‘పరారీలో ఉన్నాడని.. దొరకలేదని’ వారు చెప్పుకొచ్చారు. అనంతరం నాలుక కరుచుకున్న మంత్రి కేటీఆర్ ‘రాజు దొరకలేదని.. పోలీసులు వెతుకుతున్నారని’ కవర్ చేశారు. నిందితుడు రాజు విషయంలో మంత్రి కేటీఆర్ ఇప్పటికే అడ్డంగా బుక్కయ్యారు.
తాజాగా మరోసారి కేటీఆర్ ఇలాగే దొరికిపోయారు. ఏపీలో ప్రస్తుతం ‘ఇంటింటికి వ్యాక్సినేషన్ ’ కార్యక్రమం కొనసాగుతోంది. సీఎం జగన్ ఆదేశాలతో ఆశావర్కర్లు ఊరువాడ, పల్లె పట్నంలో తిరుగుతూ దొరికిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. జాతీయ మీడియాలో కూడా ఏపీలో వ్యాక్సినేషన్ పై వార్తలు, ట్వీట్లు, ప్రశంసలు కురుస్తున్నారు. పొలాల వద్దకు కూడా వచ్చి రైతులకు ఏపీ ఆశా కార్యకర్తలు టీకాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రెండు రోజుల క్రితం వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం సీఎం జగన్ చేస్తున్న వ్యాక్సినేషన్ పై ట్వీట్ చేసి ప్రశంసలు కురిపించారు. ‘‘రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉద్యోగులందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వైద్యారోగ్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉద్యమంలా సాగుతోంది.’’అంటూ వ్యవసాయ పొలాలు, గ్రామ శివారుల్లోకి వెళ్లి వ్యాక్సిన్లు వేస్తున్న ఆశావర్కర్ల ఫొటోలను ట్వీట్ చేశారు.
తాజాగా మంత్రి కేటీఆర్ సైతం ‘‘సీఎం కేసీఆర్ సర్కార్ లో ఆశావర్కర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని.. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారని’’ వారి సేవలను కొనియాడారు.
అయితే ట్విస్ట్ ఏంటంటే మంత్రి కేటీఆర్ ‘ఖమ్మం, రాజన్న సిరిసిల్ల’ జిల్లాల్లో ఈ టీకాలు వేశారని ట్వీట్ చేశాడు. అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన ఫొటో రెండు రోజుల ముందే ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిందే.. ఆయన ఏపీలో ఆశావర్కర్లు వేసిన ఫొటోను పంచుకున్నారు. దాన్నే కేటీఆర్ ట్వీట్ చేసి తెలంగాణ జిల్లాల్లో వేశారని చెప్పుకొచ్చాడు.
దీంతో నెటిజన్లు తగులుకున్నారు. ఏపీ ఎంపీ షేర్ చేసిన ఫొటోను పట్టుకొని కేటీఆర్ తెలంగాణలో చేశాడని అంటున్నారని.. ఆ రెండు ట్వీట్లను పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. ఏపీలో వేస్తే తెలంగాణలో వేసినట్టు కేటీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. కేటీఆర్ పై భారీగా సెటైర్లు వేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/KTRTRS/status/1441243990301417481?s=20
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉద్యోగులందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వైద్యారోగ్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉద్యమంలా సాగుతోంది. pic.twitter.com/eLCqT2oSQ6
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2021