Homeజాతీయ వార్తలుబీఏసీ మీటింగ్ లో బీజేపీపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

బీఏసీ మీటింగ్ లో బీజేపీపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

CM KCRతెలంగాణ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 5వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్ద పీట వేయాలని సూచిస్తున్నారు. సభా నిర్వహణలో హుందాతనం పాటించాలని చెబుతున్నారు. సభ్యుల హక్కుల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా మసలుకునే విధంగా సభ్యుల్లో పరివర్తన రావాలని ఆకాంక్షిస్తున్నారు. సభ ప్రారంభం కాగానే దివంగత సభ్యులకు సంతాపం ప్రకటించారు. అసెంబ్లీలో అజ్మీరా చందూలాల్, కేతిరెడ్డి సాయిరెడ్డి, ఎంఎస్ఆర్, మాచర్ల జగన్నాథం, మండలిలో రహమాన్, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు.

సభ నిర్వహణపై సమయం పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కొద్ది రోజుల సమయంతో సమస్యలు పరిష్కారమయ్యే వీలు ఉండదని తెలుస్తోంది. అందుకే సభా నిర్వహణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వం చెబుతున్నా ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. నిబంధనల ప్రకారం విధి విధానాలు రూపొందించుకుని ఐకమత్యంతోనే ముందకు కదలాలని చెబుతున్నారు.

అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షాల పాత్ర ప్రముఖమైనదే. ప్రభుత్వానికి సూచనలు చేయడంలో గౌరవప్రదమైన సలహాలు, సూచనలతో ప్రజలకు మేలు కలిగే పనుల నిర్వహణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం మామూలే. ప్రజలకు కావాల్సిన అవసరాల మేరకే చట్టాలు చేయాల్సిన అవసరం గురించి తెలిసిందే. ఇందులో ప్రశ్నోత్తరాలు, సభా నిర్వహణ, జీరో అవర్ తదితర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి సహకరించాలని సూచిస్తున్నారు.

ఈనెల 25,26 (శని,ఆదివారాలు), అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 3 ఆదివారం సెలవు దినాలు కావడంతో అసెంబ్లీ కేవలం ఏడు రోజుల పాటే కొనసాగనుంది. సభ నిర్వహణలో ఇంత తక్కువ రోజులు సమయం ఉండడంతో సమస్యలు ఎక్కడ చర్చకు వస్తాయని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. బీఏసీ సమావేశానికి తమకు ఆహ్వానాలు అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు మండిపడ్డారు. దీనిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభా మర్యాదలు పాటించాలని కోరారు.సభ్యులు గౌరవప్రదంగా మాట్టాడుతూ ప్రజల్లో చులకన కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version