KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే రేపు. ఆ డే సంబురాలకు టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా రెడీ అవుతున్న వేళ అనుకోని ఉపద్రవం ఏర్పడింది. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ తర్వాత నంబర్ 2 కేటీఆరే. కేసీఆర్ బయటకు రారు. మొత్తం కేటీఆరే చూసుకుంటారు. రాష్ట్రానికి కర్త కర్మ క్రియలా వ్యవహరిస్తారు. ఇటు ప్రభుత్వంలో.. అటు టీఆర్ఎస్ పార్టీలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బిజీగా సాగుతారు. అలాంటి కేటీఆర్ ఒక్కసారి స్ట్రక్ అయిపోయారు. ఆయన పుట్టినరోజుకు ఒకరోజు ముందు అనుకోని ప్రమాదం జరిగింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

బిజీ షెడ్యూల్ లో శనివారం పర్యటిస్తుండగా కేటీఆర్ కు ప్రమాదం సంభవించింది. ఉరుకులు పరుగులతో పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్న ఆయన గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో కింద పడిపోయారు. మంత్రి కేటీఆర్ ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడడంతో చీలమండ (యాంకిల్) ఫ్రాక్చర్ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా తెలిపారు.
చికిత్స అనంతరం ఇంటికి చేరిన కేటీఆర్ సోఫాలో టీవీ వంక చూస్తున్న ఫొటోను ట్వీట్ చేశాడు. అందులో కేటీఆర్ కాలుకు మొత్తం పట్టీ చుట్టి ఉంది. కాలీ చీలమండకు పెద్ద బూటు లాంటి బ్యాండేజీతో కనిపించారు. ఓ కార్యక్రమంలో కింద పడిపోయానని.. దీంతో చీలమండ దెబ్బతిన్నదని శనివారం సాయంత్రం కేటీఆర్ ఓ ట్వీట్ చేశాడు. బ్యాండేజ్ వేసుకొని కాలు చాపుకొని కూర్చున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
డాక్టర్లు ఈ గాయం తగ్గేందుకు 3 వారాల సమయం పడుతుందన్నారని.. అందుకే అందుకే ఈ మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోబోతున్నానని తెలిపారు. ఈ మూడు వారాల పాటు కాలక్షేపం కోసం ఓటీటీలో ఏవైనా మంచి కంటెంట్ ఉన్న కార్యక్రమాలు ఉంటే తెలుపాలంటూ కేటీఆర్ నెటిజన్లను కోరారు.
ఎప్పుడో కానీ వీలు దొరకని కేటీఆర్ కు ఈ ఫ్యాక్చర్ తో మూడు వారాల పాటు సమయం దొరికినట్టైంది. ఎటూ కదలకుండా ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖాళీ సమయాన్ని సినిమాలతో కాలం గడిపేందుకు కేటీఆర్ డిసైడ్ అయ్యాడు.
Had a fall today & ended up tearing my ankle ligament. Been advised 3 weeks of rest 🙁
Any advise on binge worthy OTT shows? pic.twitter.com/sWat7eCkWX
— KTR (@KTRBRS) July 23, 2022