Minister KTR on BJP Campaign: తెలంగాణలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. తనదైన శైలిలో రెచ్చిపోయారు. బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర కాదు ప్రజా వంచన యాత్రగా అభివర్ణిస్తున్నారు. కరువు నుంచి కోలుకున్న పాలమూరు నుంచి పాదయాత్ర చేపట్టడంలో బీజేపీ నేతల ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ నేతలు ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం చూపించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిండం సమంజసం కాదని పేర్కొన్నారు.

దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బీజేపీ మొసలి కన్నీరు కారుస్తూ పాదయాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనే వాదన వస్తోంది. దీనిపై పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఇలా చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై ఏం సమాధానం చెబుతారని అన్నారు.
హిందువులమని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు దేవాలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారు? భద్రాచలం కు ఏం పనులు చేశారు? యాదాద్రి నిర్మాణానికి ఎన్ని కేటాయించారని ప్రశ్నించారు. వట్టి మాటలు చెబుతూ జనాన్ని తప్పు దారి పట్టించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే యాత్ర పేరుతో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధిలో వారి పాత్ర ఏమిటో చెప్పాలని నిలదీశారు.
Also Read: ఆత్మకూరు లో మేకపాటి తమ్ముడే అభ్యర్థయినా? పోటీ అనివార్యమేనా?
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కేంద్రం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. వడ్లు కొనుగోలు చేయకుండా రాష్ర్టప్రభుత్వంపై భారం మోపిందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతున్నవన్ని అబద్దాలే. ఆయన నోరు తెరిస్తే అబద్ధాల పట్ట అని వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణకు అన్యాయమే చేస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోందన్నారు.
నదీ జలాల విషయంలో బీజేపీ వైఖరి వివాదాస్పదంగా ఉందన్నారు. నీతిఆయోగ్ నిధులు ఇవ్వాలని సూచించినా ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో నదీ జలాల్లో వాటాలు తేలకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో పాదయాత్రల పేరుతో ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తన ఉందని దుయ్యబట్టారు.
[…] Zodiac Signs: మన దేశంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో విశ్వాసం ఉంది. అందుకే మనవారు పంచాంగం ప్రకారమే అన్ని చేస్తారు. మంచి ముహూర్తం చూసుకోనిదే ఏ పని చేయరు. దానికున్న విలువ అలాంటిది. అన్ని శాస్త్ర ప్రకారమే జరగాలని భావిస్తారు. ప్రతి రాశి వారికి ఏవో ప్రత్యేకతలు ఉండటం తెలిసిందే. కొందరికి క్రీడల్లో మరికొందరికి పాటల్లో రాణిస్తుంటారు రాశులకు ఉన్న ప్రాశస్త్యం అలాంటిది. ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. […]