Most Eligible Bachelor: పాపం అఖిల్ అక్కినేనికి ఇంకా సాలిడ్ హిట్ రాలేదు. కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ ఓ ఏవరేజ్ హిట్ వచ్చింది. కాకపోతే థియేటర్స్ నుంచి ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడు. కానీ తాజాగా ఈ సినిమాకి వచ్చిన ఓ రికార్డ్ కారణంగా అఖిల్ మనసు ప్రస్తుతం కుదుట పడింది.

ఇంతకీ అఖిల్ సినిమాకి దక్కిన క్రెడిట్ ఏమిటంటే.. రెండు రోజుల క్రితం ఈ చిత్రం ఆహా యాప్ లో విడుదలైంది. సినిమా పెట్టిన రెండు గంటల వరకు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఒక్కసారిగా ప్రేక్షకులు బ్యాచిలర్ పై పడ్డారు. దాంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ ను సాధించి ఒక రికార్డ్ ను సృష్టించుకుంది.
Also Read: అఖిల్ ‘బ్యాచ్‌లర్’ పై బాక్సాఫీస్ రిపోర్ట్ !
నిజంగానే అఖిల్ సినిమాకి ఇలాంటి ఒక రికార్డు నమోదు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కి థియేటర్స్ లో పెద్ద విజయం దక్కలేదు. కొన్ని ఏరియాల్లో అయితే, ఓపెనింగ్ రోజే జనం లేరు. అలాంటి సినిమాకు రెండు రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అంటే గ్రేటే. మొత్తమ్మీద అఖిల్ సినిమా ఓటిటిలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
తన సినిమా ఈ రేంజ్ హిట్ సాధించడంతో అఖిల్ టీమ్ కు ఫుల్ హ్యాపీగా ఉంది. మొత్తానికి తనకు దక్కిన ఈ విజయం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది అని అఖిల్ బాబు తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని తెగ సంతోషపడుతున్నాడట. సాధించిన విజయం చిన్నది అయినా.. రాక రాక వచ్చిన విజయం కాబట్టి.. అఖిల్ లో ఈ స్థాయి హుషారు ఉండటంలో ఆశ్చర్యం లేదు.
Also Read: సక్సెస్ నెత్తికెక్కి ఎక్కువ చేస్తే… త్వరగా సర్దుకోవాల్సి వస్తుంది!
ఇక ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రం ద్వారా అఖిల్ తన తొలి ఏవరేజ్ హిట్ ను అందుకున్నాడు. అలాగే ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. అన్నట్టు ఈ ఏవరేజ్ హిట్ తో బొమ్మరిల్లు భాస్కర్ మరో చిత్రాన్ని పట్టుకున్నాడు.