https://oktelugu.com/

Sridevi: ముగ్గురు టాలీవుడ్ హీరోలతో శ్రీదేవి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అనే విషయం ఎవరికైనా తెలుసా??

Sridevi: మన టాలీవుడ్ లో బాలనటిగా కెరీర్ ని ప్రారంబించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి..అప్పట్లోనే ఈమె ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఎలేసింది..ఈమెతో సినిమాలు చెయ్యడానికి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరుకు స్టార్ హీరోలు మరియు దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు..దేవతని తలపించే అందం మాత్రమే కాదు, అద్భుతమైన అభినయం కూడా ఆమె సొంతం..తెలుగు సినిమాలతో కెరీర్ ని ఆరంభించి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 27, 2022 / 12:26 PM IST
    Follow us on

    Sridevi: మన టాలీవుడ్ లో బాలనటిగా కెరీర్ ని ప్రారంబించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి..అప్పట్లోనే ఈమె ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఎలేసింది..ఈమెతో సినిమాలు చెయ్యడానికి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరుకు స్టార్ హీరోలు మరియు దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు..దేవతని తలపించే అందం మాత్రమే కాదు, అద్భుతమైన అభినయం కూడా ఆమె సొంతం..తెలుగు సినిమాలతో కెరీర్ ని ఆరంభించి తమిళ్ , మలయాళం , హిందీ , కన్నడ ఇలా ప్రతి భాషలో అక్కడి స్టార్ హీరోలతో కలిసి నటించి తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అవేమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    Sridevi

    ఇక అసలు విషయానికి వస్తే శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ప్రముఖ నిర్మాత బోణి కపూర్ తో ప్రేమ లో పడి, కొన్ని రోజులు అతనితో సహా జీవనం చేసి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ బోణి కపూర్ తో ప్రేమలో పడకముందు శ్రీదేవి కి వాళ్ళ అమ్మ గారు ఎన్నో పెళ్లి సంబంధాలు చూసారు..మన టాలీవుడ్ లో కూడా కొంతమంది హీరోలతో శ్రీదేవి గారికి పెళ్లి జరిపెందుకు అప్పట్లో చర్చలు కూడా జరిపారు అట వాళ్ళ అమ్మ గారు..ఆ హీరోల లిస్ట్ లో మన యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కూడా ఉన్నట్టు సమాచారం.

    Also Read: Beast Movie: సినిమా ఫ్లాపయితే.. ఆ పార్టీలెందుకు రాజా..? ‘బీస్ట్’ చిత్ర యూనిట్ పై సెటైర్లు

    శ్రీదేవి మరియు రాజశేఖర్ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించకపొయ్యినప్పటికీ ఎందుకో రాజ్ శేఖర్ ని చూడగానే నచ్చి మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాము మీకు ఇష్టం అయితే అని శ్రీదేవి గారి అమ్మ రాజ్ శేఖర్ ని అడిగారు అట..కానీ అప్పటికే జీవిత తో ప్రేమ లో ఉన్న రాజ్ శేఖర్ శ్రీదేవి గారి తల్లి ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించారు అట.

    Sridevi

    ఇక హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా అప్పట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మురళి మోహన్ గారిని కూడా శ్రీదేవి తో పెళ్లి కోసం అడిగారు అట..కానీ ఎందుకో ఈ సంబంధం కూడా సెట్ కాలేదు..ఇక బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ అప్పటి టాప్ హీరో మిథున్ చక్రవర్తి తో ప్రేమాయణం నడిపిన శ్రీదేవి అతనితో సహజీవనం కూడా చేసింది..కానీ అప్పటికే మిథున్ చక్రవర్తి కి పెళ్లి అయ్యిపోయింది..అయినప్పటికీ కూడా వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయినా శ్రీదేవి తల్లి గారు మాత్రం వీరి పెళ్ళికి ఒప్పుకోలేదు..అలా వీళ్లిద్దరి పెళ్లి, పీటలు వరుకు వచ్చి క్యాన్సిల్ అయ్యింది..చివరికి బాలీవుడ్ టాప్ నిర్మాత బోణి కపూర్ ని పెళ్లి చేసుకొని ఎంతో సుఖవంతమైన జీవితం ని గడిపి ఇద్దరు ఆడపిల్లలకు పిల్లలకి జన్మని ఇచ్చింది శ్రీదేవి..ఆ ఇద్దరిలో శ్రీదేవి మొదటి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా చలామణి అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

    Also Read:Nidhhi Agerwal: పాపం ‘పవన్’ హీరోయిన్ ని అందరూ వదిలేస్తున్నారు !

    Recommended Videos:

    Tags