https://oktelugu.com/

చిరు సలహా వెనక అంతపెద్ద కుట్రనా..?

ప్రజారాజ్యంతో వైఫల్యాన్ని చవిచూసిన మెగాస్టార్ వల్ల జనసేనకు సమకూరే మేలు ఏమిటనే ప్రశ్నలు అత్పన్నమవుతా యి. నిజంగానే పవన్ కు చివరంజీవి సహకరించే అవకాశాలున్నాయా..? అనే సంశయమూ తలెత్తుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీతో కలిగి అడుగులు వేస్తున్నాడు. గతంలో చిరంజీవి కాంగ్రెస్తో కలిసి కేంద్రంలో మంత్రి పదవిని నిర్వహించారు. సొంతంగా పార్టీతో ఆంధ్ర ప్రదేశ్ ను ప్రభావితం చేయడం సాధ్యం కాదనే భావనకు మెగా సోదరులు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు రాజకీయాలు తారుమారు కావు.. అందువల్ల […]

Written By: , Updated On : January 30, 2021 / 11:58 AM IST
Follow us on

Chiru-Pawan
ప్రజారాజ్యంతో వైఫల్యాన్ని చవిచూసిన మెగాస్టార్ వల్ల జనసేనకు సమకూరే మేలు ఏమిటనే ప్రశ్నలు అత్పన్నమవుతా యి. నిజంగానే పవన్ కు చివరంజీవి సహకరించే అవకాశాలున్నాయా..? అనే సంశయమూ తలెత్తుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ బీజేపీతో కలిగి అడుగులు వేస్తున్నాడు. గతంలో చిరంజీవి కాంగ్రెస్తో కలిసి కేంద్రంలో మంత్రి పదవిని నిర్వహించారు. సొంతంగా పార్టీతో ఆంధ్ర ప్రదేశ్ ను ప్రభావితం చేయడం సాధ్యం కాదనే భావనకు మెగా సోదరులు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు రాజకీయాలు తారుమారు కావు.. అందువల్ల తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను , సామాజిక వర్గం పరంగా కాపాడుకోవాలంటే.. తనకు గట్టి పట్టున్న సినిమా రంగాన్ని విడిచి పెట్టకూడదని చిరంజీవి సలహాలోని అంతర్యం.

Also Read: ప్రభుత్వాన్ని వదలని నిమ్మగడ్డ

ఏపీలో ఉన్న కులపరమైన సమీకరణ తెలంగాణలో కనిపించదు. ఏపీలో రాజకీయంగా రెండు కులాల మధ్య ప్రధాన పార్టీల చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. మూడోవర్గంగా పవన్ కల్యాణ్ పెట్టని జనసేన ఇప్పుడిప్పుడే.. పాదుకుంటోంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కొంతమేర సంఘితమైన కాపు సామాజిక వర్గం.. ఆ తరువాత రాజకీయంగా మళ్లీ.. చీలిపోయింది. టీడీపీ వైసీపీ సామాజిక వర్గాలకు వెన్నుదన్నుగా ఉన్నప్పటికీ.. ఇతర కూలాలు కూడా ఆకర్షితమవుతున్నాయి. కానీ ప్రజారాజ్యం, జనసేనలు ఇతర సామాజిక వర్గాల ఓట్లను పెద్ద ఎత్తున రాబట్టడంతో విఫలం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలు సొంతకాళ్లపై నిలుచుండడం కష్టం.. తమిళనాడు రాష్ర్టాల్లో కులపమైన పార్టీలు చాలా ఉన్నాయి. కానీ ఏదో ఒక పార్టీకి మద్దతుగా ఉంటాయి.

Also Read: ‘కాపు సంక్షేమం’ పవన్ కోసమేనా?

పార్టీ నడపడం అంత సులభం కాదనే గ్రహింపుతోనే గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. అప్పటికీ రాష్ర్ట విభజన జరుగుతుందనే అంచనా లేదు. దాంతో కేవలం సహాక మంత్రి పదవితోనే సరిపెట్టకోవాల్సి వచ్చింది. నవ్యాంధ్రలో సామాజికవర్గం పరంగా అత్యధిక ఓటింగు ఉన్నప్పటికీ.. బంగారంలాంటి అవకాశం కోల్పోయాడు. కాంగ్రెసుకు బయటినుంచి మద్దతు ప్రకటించి పార్టీని కాపాడుకుంటే.. ఇప్పుడు ఏపీలో అధికారంలో వచ్చే అవకాశం ఉండేది. అదే తరహా తప్పిదాన్ని పవన్ కల్యాణ్ కూడా చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని రాజకీయంగా సీట్లు తీసుకుంటే.. రాజకీయంగా బలంగా ఉండేది. స్వచ్ఛంద సహకారం ఇవ్వడంతో టీడీపీ పార్టీని వాడుకుని వదిలేసింది. 2019లోనూ.. కమ్యూనిస్టులతో కలిసి తీవ్రమైన పరాభావాన్ని చవిచూశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వల్ల చిరంజీవికి సమకూరిన ప్రయోజనం పెద్దగా లేదు. రాజ్యసభ సీటు.. సహాయమంత్రి పదవి… మత్రమే దక్కాయి. నటుడిగా కన్నా.. రాజకీయంగా అతడికి దక్కింది శూన్యం.. పదేళ్ల తరువాత దేశంలో కాంగ్రెస్ బలహీన పడింది. మోదీ హవా కొనసాగుతోంది. 2024 నాటికి పరిస్థితి ఏమిటనేది చెప్పలేం. మతరపమైన ఎజెండా నేపథ్యంలో బీజేపీ తన ప్రభావాన్ని నిలబెట్టుకుంటోంది. ఏపీలో టీడీపీ, వైసీపీ బలహీన పడినప్పడే.. జనసేన.. బీజేపీ కాంబినేషన్ కు అవకాశాలు ఉంటాయి. తంతవరకు సుదీర్ఘ పోరాటం చేయాల్సిందే.. దుకు అనుకూలంగా తమ్ముడు తయారు కావాలన్న యోచనతే సినిమాలు.. రాజకీయాలు రెండింటిని నడపాలని చిరంజీవి సలహా ఇచ్చారన్నది రాజకీయ విశ్లేషణ.