Mega Family Donation to Farmers : కౌలు రైతుల కోసం మెగా ఫ్యామిలీని జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం చేశాడు. వారిని ఆదుకునే విషయంలో తనే కాదు.. తన కుటుంబ సభ్యులను కూడా ప్రోత్సహించి విరాళం ఇచ్చేలా చేశాడు.

ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ తనకు సినిమాల్లో వచ్చిన ఆదాయంతో ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతు కుటుంబాల కోసం రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చి ఉదారత చాటుకున్నాడు. వాటి ద్వారానే ఏపీ వ్యాప్తంగా తిరిగి కౌలురైతులకు కుటుంబానికి రూ.లక్ష చొప్పున సొంత డబ్బులతో సాయం చేశారు.
ఇప్పుడు ఈ మహాక్రతువులో మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా భాగమయ్యారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ఆయన అక్కా చెల్లెల్లు.. సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ, నిహారికలు కలిసి రూ.30 లక్షల రూపాయలను ఈ కౌలు రైతులను ఆదుకునేందుకు విరాళంగా అందజేశారు.
ఏపీలో ఇప్పటికే ఈ కౌలురైతులకు జనసేనాని పవన్ కళ్యాణ్ రూ.1లక్ష చొప్పున జిల్లాలకు తిరిగి పంచాడు. అయితే అయినప్పటికీ చాలా మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల్లో తండ్రిని కోల్పోయి విద్యకు దూరంగా పిల్లలు బతుకీడుస్తున్నారు. వారికి ఆర్థిక భరోసానందించేందుకు ఈ విరాళం ఉపయోగపడుతుందని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఈ డబ్బులతో కౌలు రైతులకు సాయం చేస్తామని నాదెండ్ల చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.