
Tirupati: తిరుమల కొండ పై అపచారం జరిగింది. ఏళ్లనాటి ప్రతిష్ట మంటగలిసింది. నిర్లక్ష్యం, అలసత్వం వెరసి తిరుమలను అపవిత్రం చేసింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. వరుస ఘటనలతో తిరుమ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. కాపాడాల్సిన టీటీడీ మొద్దు నిద్రపోతోంది. తిరుమలేశుని సన్నిధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంది. నిర్వహణలో తీవ్రంగా విఫలమవుతోంది. ఇంతకీ తిరుమల కొండ పై ఏం జరిగింది ? ఎందుకు జరిగింది ? అపచారం చేసిన వారెవరు ? ఇత్యాది ప్రశ్నలు భక్తులను వేధిస్తున్నాయి.
Also Read: Troll Of The Day: ట్రోల్ ఆఫ్ ది డే : ఇంకేం అమరావతి ‘సాంబశివ’.. గూబ గుయ్యిమందిగా
శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో మద్యం, మాంసం నిషేధం. అనాదిగా వీటి నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వమున్నా సరే.. తిరుమల పవిత్రకు కంకణబద్దులై ఉండేవారు. తిరుమల పవిత్రను కాపాడేవారు. కానీ తాజాగా తిరుమలలో చోటుచేసుకుంటున్న ఘటనలు భక్తులను ఆగ్రహానికి, ఆవేదనకు గురిచేస్తున్నాయి. టీటీడీ , ఏపీ ప్రభుత్వ తీరు పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అధికారుల బాధ్యతారాహిత్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇటీవల తిరుమలలో మద్యం సేవించి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు మాంసాహారాన్ని వండటం ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజాగా తిరుమలలోని షికారీ వీధిలో షికారీలు మాంసం వండినట్టు టీటీడీ అధికారులకు సమాచారం వచ్చింది. షికారీ వీధికి వెళ్లిన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. షికారీలకు మాంసం ఎక్కడ నుంచి వచ్చింది ? ఎవరిచ్చారు ? షికారీలు మాంసం తెస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారు ? భద్రతా బలగాల నిఘా ఏమైంది ? అన్న కోణంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో అధికారులు విచారణను వేగవంతం చేశారు.
తిరుమల కొండ పై మాంసాన్ని వండిన షికారీలు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు చర్చకు వచ్చింది. షికారీలు స్వతహాగా సంచార జాతి అని తెలుస్తోంది. వీరు ప్రధాన ఆహారమార్గం వేట. జంతువులను వేటాడి వీరు ఆహారం సంపాదిస్తారు. వీరు మహారాష్ట్ర నుంచి ఏపీకి వలస వచ్చినట్టు చరిత్రకారులు చెబుతారు. ఛత్రపతి శివాజీ ఆంధ్రప్రదేశ్ దండ్రయాత్ర సమయంలో షికారీలు ఏపీకి వచ్చి స్థిరపడినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. శివాజీని వీరు తమ దేవుడిగా కొలుస్తారు. తమది శివాజీ వంశమని చెబుతారు. వేటలో దొరికిన మాంసాన్ని వీరు అందరూ సమానంగా పంచుకుని తింటారు. అన్నిరకాల మాంసాన్ని కలిపి వండుకుని తినడం వీరికి అలవాటు. ప్రస్తుతం ఈ తెగవారు వేట వదిలేసి వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

తిరుమలలో షికారీలు మాంసం వండటం అధికారుల వైఫల్యమనే చెప్పవచ్చు. అధికారుల భద్రతాలోపాల కారణంగానే ఈ ఘటన జరిగింది. లేనిపక్షంలో ఇలాంటి ఘటనలు జరిగేవి కావు. దీనికి టీటీడీ బాధ్యతను తీసుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలకు తావుండదు. స్వతహాగా మాంసాహారులైన షికారీలకు తిరుమల పవిత్రత గురించిన అవగాహన కల్పించి.. వారిలో మార్పు తీసుకురాగలిగితే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగవు.
Also Read:Jaganasura Rakta Charitra: జగనాసుర రక్తచరిత్ర పుస్తకం విడుదల.. అన్నంత పనిచేసిన టీడీపీ