గ్రేటర్ నజర్: కేసీఆర్ అలెర్ట్.. భారీగా పోలీసుల బదిలీలు

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సర్దుకుంటున్నట్టు తెలిసింది. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి.. ప్రజల్లో వ్యతిరేకత.. హైదరాబాద్ లో వరద సాయం విషయంలో టీఆర్ఎస్ విమర్శలు చెలరేగడంతో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. కీలకమైన గ్రేటర్ ఎన్నికల ప్రక్రియకు పోలీస్ వ్యవస్థ అంత్యంత కీలకం కావడంతో ప్రభుత్వం, డీజీపీ భారీగా పోలీసులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తమకు అనుకూలురు, స్టిక్ట్ ఆఫీసర్లను హైదరాబాద్ కు బదిలీ చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. Also Read: గ్రేటర్ […]

Written By: NARESH, Updated On : November 15, 2020 11:49 am
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సర్దుకుంటున్నట్టు తెలిసింది. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి.. ప్రజల్లో వ్యతిరేకత.. హైదరాబాద్ లో వరద సాయం విషయంలో టీఆర్ఎస్ విమర్శలు చెలరేగడంతో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. కీలకమైన గ్రేటర్ ఎన్నికల ప్రక్రియకు పోలీస్ వ్యవస్థ అంత్యంత కీలకం కావడంతో ప్రభుత్వం, డీజీపీ భారీగా పోలీసులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తమకు అనుకూలురు, స్టిక్ట్ ఆఫీసర్లను హైదరాబాద్ కు బదిలీ చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: గ్రేటర్ నజర్: కేసీఆర్ అలెర్ట్.. భారీగా పోలీసుల బదిలీలు

గ్రేటర్ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సమాయత్తమవుతుండడంతో వివాదాస్పదులు, సరిగా పనిచేయని వారు.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారు.. దురుసు ప్రవర్తన ఉన్నవారిని బదిలీ చేసినట్టు పోలీస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.. కొందరు హైదరాబాద్లో ఉన్న డీఎస్పీలను డిమోషన్ కింద జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వేయగా.. మరికొందరిని తీసుకొచ్చి నగరంలో పోస్టింగ్ ఇచ్చారు.

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేళ తెలంగాణ పోలీస్ బాస్ చేసిన ఈ బదిలీలు పోలీసు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 15 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన ఏరియాల్లో బదిలీలు చేయడం.. జీహెచ్ఎంసీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: ‘గ్రేటర్’ విజయం కోసం టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్

*బదిలీ అయిన డీఎస్పీలు వీరే..

– శంషాబాద్ ఏసీపీగా భాస్కర్
-బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్
-పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి
-ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావు బదిలీ
– పంజాగుట్ట ఏసీపీగా గణేష్
-కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్
-ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి
-బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి
– సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్
-సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ