https://oktelugu.com/

Haiti: భూకంప ధాటికి విలవిలలాడిన హైతీ

కరీబియన్ దీవుల్లో భూకంపం పెను విపత్తును సృష్టించింది. హైతీ దేశంలో శనివారం సంభవించిన భారీ భూకంపం ధాటికి ఆదివారం నాటికి 1297 మంది దుర్మరణం చెందారు. మరో 2800 మంది గాయపడ్డారు. భూకంపం తీవ్రతకు ఇళ్లు వందల సంఖ్యలో దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య పెరిగే సూచనలున్నాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదైంది. దీంతో హైతీ విలవిలాడుతోంది. రాజధాని పోల్టౌ ప్రిన్స్ కు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో భూకంప […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2021 / 09:21 AM IST
    Follow us on


    కరీబియన్ దీవుల్లో భూకంపం పెను విపత్తును సృష్టించింది. హైతీ దేశంలో శనివారం సంభవించిన భారీ భూకంపం ధాటికి ఆదివారం నాటికి 1297 మంది దుర్మరణం చెందారు. మరో 2800 మంది గాయపడ్డారు. భూకంపం తీవ్రతకు ఇళ్లు వందల సంఖ్యలో దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య పెరిగే సూచనలున్నాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.2గా నమోదైంది. దీంతో హైతీ విలవిలాడుతోంది. రాజధాని పోల్టౌ ప్రిన్స్ కు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగాయి. ఆదివారం తెల్లవారుజామున కూడా 6 ప్రకంపనలు వచ్చాయి.

    హైతీలో భూకంపం తీవ్రతకు పట్టణాలు దెబ్బతన్నాయి. ఎటు చూసినా దారుణమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇళ్లు, హోటళ్లు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలుభయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భయంతో పరుగులు పెడుతున్నారు. ఎవరు కూడా ఇళ్లల్లో ఉండడం లేదు. అందరు రోడ్లపైనే జాగారం చేస్తున్నారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది. తీరప్రాంత పట్టణమైన లెన్ కేయన్ దారుణంగా దెబ్బతింది. ఎటు చూసినా హృదయ విదాకర సంఘటనలే కనిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం ఓ మార్కెట్ లో పళ్లు, తాగునీరు అందుబాటులో ఉంచగా జనం ఎగబడి వచ్చారు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.

    భూకంప ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఏరియల్ హెన్రీ పర్యటించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. దేశమంతా నెల రోజుల పాటు అత్యవసర పరిస్థితి ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సాయం కోరారు. సుమారు 800 ఇళ్లు నేలకూలినట్లు హైతీ ఉన్నతాధికారి జెర్రీ క్యాండ్ లర్ తెలిపారు. ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రార్తనా మందిరాలు చాలా దెబ్బతిన్నట్లు గుర్తించారు. లెన్ కేయన్ కు 10.5 కిలోమీటర్ల దూరంలోఉన్న ఓ చిన్న ద్వీపంపైన కూడా భూకంపం విరుచుకుపడింది.

    కరోనా మహమ్మారి ప్రభావం, ఇటీవల దేశాధ్యక్షుడి హత్య, పెరుగుతున్న పేదరికం వంటి సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో దేశం భూకంపం బారిన పడటంతో ఇంకా మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది పరిస్థితి. అమెరికా అందించిన తొలి బ్యాచ్ కొవిడ్ టీకాలు గత నెలలోనే వచ్చాయి. మరో వైపు గత నెలలో దేశాధ్యక్షుడు జోవెనెల్ మోయిన్ ఆయన ఇంటిలోనే హత్యకు గురికావడంతో హైతీ రాజకీయంగా అస్థిరత పాలయింది.