CM KCR- Marked Sharad: భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా చక్రాలు తిప్పాలని కేసీఆర్ అనుకుంటున్నాడు కదా! ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్ర మీద పడ్డాడు కదా! తెలంగాణ మోడల్ అమలు చేస్తామంటూ అక్కడి ప్రజలకు అలవి కాని హామీలు ఇస్తున్నాడు కదా! తెలంగాణ మోడల్ అమలు చేస్తామంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నాడు కదా! ఇన్ని చేసినప్పటికీ కీసీఆర్ కు ఫాయిదా లేకుండా పోయింది. భోకర్ మార్కెట్ కమిటీ లో బొక్క బోర్లా పడ్డ తర్వాత కేసీఆర్.. ఆత్మరక్షణలో పడ్డాడు అని అందరూ అనుకున్నారు. కానీ దాని నుంచి తెలివిగా డైవర్ట్ చేసేందుకు మహారాష్ట్ర నుంచి ఊరు పేరు తెలియని వారిని పార్టీలోకి ఆహ్వానించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించాడు. అయితే ఈ చేరికల్లో శరత్ మర్కడ్ అనే యువకుడు ఉన్నాడు. వాస్తవానికి భారత రాష్ట్ర సమితిలో చేరిన వందల మందిలో శరత్ కూడా ఒకడు. ఇప్పుడు అతడు సీఎంవో లో కీలకమయ్యాడు. మహారాష్ట్ర వ్యక్తి సీఎంవో లో కీలకము ఎలా అవుతాడు అనే డౌట్ మీకు వచ్చిందా? అయితే మీ డౌటును అలాగే ఉంచండి. ఎందుకంటే తెలంగాణ మోడల్ ను మహారాష్ట్రలో ప్రచారం చేసేందుకు సీఎంవో లో మరాఠీ వ్యక్తిని కెసిఆర్ నియమించాడు. ఇది గనుక అన్యాయం లాగా మీకు తోస్తే మీరు ముమ్మాటికి తెలంగాణ వ్యతిరేకులే.
18 లక్షల జీతం
శరత్ మర్కడ్ సొంత ఊరు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని నీవ్ దుంగే. ఇతడు పీజీ పూర్తి చేశాడు. ఒక ఐటీ కంపెనీ ఇతడికి ఉద్యోగం ఇచ్చింది. వేతనం నెలకు 40,000.. అయితే దాన్ని వదిలేసిన అతడు భారత రాష్ట్ర సమితిలో చేరాడు.” ఆయన మహారాష్ట్ర సేత్కారి సంఘటన్ అధ్యక్షుడు. అప్పట్లో ఆయనకు ఐటి కొలువు వచ్చింది. లక్షల్లో జీతాన్ని కూడా వదిలేసి మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేసేందుకు కేసిఆర్ సమక్షంలో భారత రాష్ట్రసమితిలో చేరాడు.. రైతు సంక్షేమానికి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలకు ఫిదా అయ్యాడు. తెలంగాణ పథకాలు మహారాష్ట్రలో అమలు చేసేందుకు గులాబీ కండుగా తప్పుకున్నాడు” అంటూ చేరికల సమయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు డప్పు కొట్టారు. ఇక నమస్తే తెలంగాణ అయితే ఏకంగా బ్యానర్ వార్త రాసి పడేసింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే అతడు చేరి నెల తిరగకముందే శరత్ కు భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వ కొలువు కట్టబెట్టింది. ఏకంగా ముఖ్యమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా నియమించింది. జీతం కూడా ఏడాదికి 18 లక్షలు ఇస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏకంగా ఈ నెల రెండున జీవో కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఈ తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ యువతకు పూర్తిస్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు కాని, మహారాష్ట్ర వాసులకు మాత్రం లక్షలకు లక్షలు ఇచ్చి కొలువులు ఇవ్వడం ఏంటని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

నలుగురు పిఏలు
వాస్తవానికి కెసిఆర్ దగ్గర నలుగురు పిఏలు పనిచేస్తున్నారు. ముగ్గురు పిఆర్వోలు ఉన్నారు. మరో వ్యక్తిని నియమించుకోవడం ముఖ్యమంత్రి విచక్షణాధికారం. కానీ, మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి వ్యవహారాలు చేసే వ్యక్తికి తెలంగాణ ఖజానా నుంచి జీతాలు చెల్లించడంపై విస్మయం వ్యక్తం అవుతున్నది. ప్రజాధనాన్ని పార్టీ కార్యకలాపాల కోసం వాడటం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఇక్కడి నిరుద్యోగులను వదిలేసి
కాకా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ” ఇక్కడి నిరుద్యోగులను పట్టించుకునే తీరికలేదు. భారత రాష్ట్ర సమితిలో చేరాడని చెప్పి శరత్ కు నజరానాగా సీఎం ప్రైవేట్ సెక్రటరీ కొలువు ఇచ్చారు. సొంత రాష్ట్రంలో కొలువులు భర్తీ చేయదు ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర వ్యక్తికి ఏడాదికి 18 లక్షల వేతనం ఎలా ఇస్తారు? పార్టీ కోసం పార్టిసి పరాయి వ్యక్తులకు లక్షల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును శీతల రూపంలో చెల్లిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి విస్తరణ కోసం ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించిన జీవో 647 ను ప్రభుత్వం దాచిపెట్టిందని” ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. మోదీని గ్యాస్ ధరలు పెంచినందుకు బండ కేసి కొట్టాలని పిలుపునిచ్చే కేటీఆర్.. మరి దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.