Mark Zuckerberg: ప్రపంచంలో సామాజిక మాధ్యమాల్లో ఫేస్ బుక్ ఓ సంచలనం. దీన్ని వాడకపోతే ఎవరి దినచర్య ప్రారంభం కాదంటే అతిశయోక్తి కాదు. అంతలా అట్రాక్ట్ అయిన వినియోగదారులు నేడు ఫేస్ బుక్, వాట్సాప్ లు వాడకుండా ఉండలేరు. ప్రతి విషయాన్ని అందులో షేర్ చేసుకోవడం అలవాటుగా మారింది. పొద్దున్నే గుడ్ మార్నింగ్ తో ప్రారంభమయ్యే ప్రక్రియ రాత్రి గుడ్ నైట్ చెప్పే వరకు కూడా వాటితోనే కాలం గడపడం చూస్తున్నాం. కరోనా పుణ్యమాని పిల్లలు కూడా చరవాణిలు వినియోగిస్తూ బిజీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వినియోగం ఎంతలా పెరిగిపోయిందో తెలుస్తోంది.

ఫేస్ బుక్ జాతకం తలకిందులైంది. దీంతో ఫేస్ బుక్ సేవల్లో అంతరాయం కలిగింది. దీనికి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాట్సాప్, ఇన్ట స్టాగ్రామ్ లు సైతం క్లాష్ కు గురయ్యాయి. దీంతో ఫేస్ బుక్ యాజమాన్యం స్పదించింది. పునరుద్ధరణ ప్రక్రియను మళ్లీ కొనసాగించేందుకు ప్రయత్నించింది. దీంతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్కు జుకర్ బర్గ్ ఆర్థికంగా దెబ్బతిన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన కుబేరుల జాబితా నుంచి కిందకు జారారు. అమెరికన్ స్టాక్ మార్కెట్ లో ఫేస్ బుక్ షేర్ల విలువ ఒక్కసారిగా పడిపోయింది. ఏఢు బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో ఫేస్ బుక్ షేర్లు, జుకర్ బర్గ్ ఆస్తులు 140 బిలియన్ డార్ల నుంచి 121.6 డాలర్లకు పడిపోయాయి. ఫలితంగా జుకర్ బర్గ్ టాప్ త్రీ నుంచి అయిదో స్థానానికి దిగజారారు.
దీంతో ఫేస్ బుక్ సేవలకు చాలా మంది వినియోగదారులు దూరమయ్యారు. ఫేస్ బుక్ ఖాతాలను ప్రారంభించలేకపోయారు. ఒక్కరోజుకే ఇంతలా నష్టం ఉంటే రోజులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. సాంకేతిక కారణాలతోనే సేవలు స్తంభించిపోవడంతో నష్టం మాత్రం భారీగానే ఉంది. దీంతో యాజమాన్యం సేవలు పాక్షికంగా పునరుద్ధరించినట్లు పేర్కొంది.